twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుడిగాడుకి సీక్వెల్ తీస్తా.. అల్లరి నరేష్ క్యూరియస్‌గా.. భీమినేని

    |

    'శుభమస్తు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి 'శుభాకాంక్షలు', 'సుస్వాగతం', 'సూర్యవంశం' లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా చెరగని ముద్ర వేశారు భీమినేని శ్రీనివాసరావు. లేటెస్ట్‌గా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది..ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..

    Bhimineni Srinivasa Rao planning Sudigadu2

    నేను స్కూల్‌, కాలేజ్‌ డేస్‌ నుండే నేను రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చేసేవాన్ని.. ఆ అనుభవంతో సినిమా మీద ఫ్యాషన్‌తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. నటుడిగా చేయాలంటే కొంత భయం వేసిటెక్నీషియన్‌ గా చేరడం జరిగింది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్న టైమ్‌ 'అశ్వద్ధామ' సినిమాలో ఒక క్యారెక్టర్‌ చేశాను. అలాగే ఆర్‌ నారాయణమూర్తి 'ఆలోచించండి' సినిమాలో సెకండ్‌ హీరోగా చేశాను. ఈ మధ్య కాలంలో 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలో తండ్రి క్యారెక్టర్‌ చేశాను, 'కెరటం'లో ఒక మంచి సినిమా క్యారెక్టర్‌ చేశాను. తరువాత 'కౌసల్య క ష్ణమూర్తి 'లో బ్యాంకు మేనేజర్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్‌ రోల్‌ అయినా మంచి కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. ఇక ముందు కూడా మంచి క్యారెక్టర్‌ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

    నా కెరీర్‌లో 'సుడిగాడు' సినిమా కాన్సెప్ట్‌ చాలా మంచిది. ఈ దర్శకుడికైనా కొన్ని సినిమాలు మైలేజ్‌నిస్తాయి అలాంటి ఒక సినిమా 'సుడిగాడు'. నాకెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా. నేను అల్లరి నరేష్‌ కూడా 'సుడిగాడు2' మీద చాలా క్యూరియస్‌గా ఉన్నాం. మంచి అవకాశం వస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు తెలిపారు.

    English summary
    Kousalya Krishnamurthy is an sports drama film, produced by K.A.Vallabha on Creative Commercials banner and directed by Bhimaneni Srinivasa Rao. The film stars Rajendra Prasad, Aishwarya Rajesh, Sivakarthikeyan in the lead roles and music composed by Dhibu Ninan Thomas.This film is a remake of the 2018 Tamil film Kanaa and marks the Telugu debut of Aishwarya Rajesh and Sivakarthikeyan.The film is scheduled to be released theatrically on 23 August 2019
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X