భీష్మ టీజర్: రష్మిక మందన్న- నితిన్ రొమాన్స్ కేక..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'భీష్మ'. యంగ్ హీరోహీరోయిన్లు నితిన్- రష్మిక మందన్న జోడీగా నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరిపై విడుదలైన పోస్టర్స్, ఫస్ట్‌లుక్స్‌కు మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'భీష్మ' టీజర్ విడుదల చేశారు మేకర్స్.
ఒక నిమిషం ఆరు సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో 'భీష్మ' సినిమాలోని ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. రష్మిక మందన్న- నితిన్ మధ్య జరిగిన రొమాన్స్, షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. నితిన్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. అలాగే హీరోయిన్ రష్మిక ఫ్రెష్ లుక్ చూపరులను అట్రాక్ట్ చేస్తోంది. మొత్తానికి టీజర్‌ని బట్టి చూస్తే భీష్మ ఫుల్ సక్సెస్ ఖాయం అని తెలుస్తోంది.

గతంలో కూడా ఓ వీడియో ద్వారా ఇటు రష్మిక అభిమానులకు, అటు నితిన్ అభిమానులకు రొమాంటిక్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. రష్మిక నడుము చూసి పరేషాన్ అవుతున్న నితిన్.. చివరకు తట్టుకోలేక ఆమెతో చించేశారు అని సైగ చేస్తూ చెప్పడం ఆ వీడియోలో హైలైట్ అయింది. ఈ రకంగా యూత్ ఆడియన్స్ చూపు తమవైపు తిప్పుకుంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ప్రేమకథా చిత్రంగా వైవిద్యభరితమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగిల్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహతి సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఫిబ్రవరి 21న భీష్మ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











