పండుగలా భోళా శంకర్ ఫంక్షన్: చిరంజీవితో పాటు గెస్టుగా ఆ స్టార్ హీరో కూడా!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన హీరో మెగాస్టార్ చిరంజీవి. దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో తనదైన రీతిలో హవాను చూపిస్తోన్న ఆయన.. ఇప్పటికీ అదే స్పీడుతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఆరంభంలోనే 'వాల్తేరు వీరయ్య'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'భోళా శంకర్' అనే సినిమాను చేస్తున్నారు. అతి త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'భోళా శంకర్'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వేదాళం'కు ఇది రీమేక్‌గా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా చేస్తూ దాదాపుగా పూర్తి చేసేశారు. ఇక, ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటనను వదిలారు.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'భోళా శంకర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 6వ తేదీన ఎంతో గ్రాండ్‌గా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. దీన్ని హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో ఆరోజు సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభించబోతున్నారు. ఇక, ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలు అయ్యాయి. దీనికి కొన్ని వేల మంది అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు, ఈ ఈవెంట్‌కు చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా.. కీర్తి సురేష్, సుశాంత్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బ్రహ్మానందం, శ్రీముఖి, రష్మీ గౌతమ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











