Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్‌కు ఊహించని ట్రీట్.. రేజ్ ఆఫ్ భోళా లోడింగ్
కొంత మంది హీరోలకు వయసు పెరుగుతున్న కొద్దీ అలుపు వస్తుంది. కానీ, టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవికి మాత్రం వయసు పెరిగే కొద్దీ ఊపొస్తున్నట్లుగా ఉంది. అందుకే ఆయన ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రీఎంట్రీలో ఆయన మూవీల వేగాన్ని ఏ హీరో కూడా అందుకోలేకపోతున్నారు. అంతలా మెగాస్టార్ ఏకధాటిగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరో 'భోళా శంకర్' మూవీలో నటిస్తున్నారు.
టాలీవుడ్‌లో ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన దర్శకుడు మెహర్ రమేష్‌తో కలిసి చిరంజీవి చేస్తున్న చిత్రమే 'భోళా శంకర్'. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'వేదాళం' మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూట్ ఎప్పుడో పూర్తైంది. అలాగే, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇవి కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు.

'భోళా శంకర్' మూవీ రిలీజ్‌కు సమయం ఆసన్నం అవడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ నుంచి 'Rage Of Bholaa' అనే ఏంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని మెహర్ రమేష్, ఫిరోజ్ ఇజ్రాయిల్ రచించగా.. అసుర, ఫిరోజ్ ఆలపించారు. ఇక, ఈ సాంగ్ టీజర్‌లోని కొన్ని డైలాగులు, విజువల్స్‌తో డిజైన్ చేసినట్లు మెహర్ రమేష్ తెలిపారు. ఇక, ఈ పాటను అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి.
ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సరసన తమన్నా భాటియా నటిస్తుండగా.. కీర్తి సురేష్, సుశాంత్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బ్రహ్మానందం, శ్రీముఖి, రష్మీ గౌతమ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











