Bhola Shankar Trailer: చిరంజీవి ఫ్యాన్స్‌కు డబుల్ కిక్.. భోళా శంకర్ ట్రైలర్ డేట్ ఫిక్స్
సాధారణంగా టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమాను కంప్లీట్ చేయాలంటే కనీసం ఏడాది సమయం అయినా తీసుకుంటున్నారు. కానీ, ఒకరిద్దరు మాత్రమే సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రీఎంట్రీలో వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న ఆయన ప్రస్తుతం 'భోళా శంకర్' మూవీ చేస్తున్నారు.
డైరెక్టర్‌గా ఇప్పటి వరకూ ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయిన మెహర్ రమేష్‌తో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే 'భోళా శంకర్'. అజిత్ కుమార్ హీరోగా తమిళంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'వేదాళం' మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన షూట్ ఎప్పుడో పూర్తైంది. అలాగే, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇవి కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. ఇలా ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
'భోళా శంకర్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే టీజర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్‌ను తీసుకు రాబోతున్నారు. దీన్ని జూలై 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మెహర్ రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎడిటింగ్ రూమ్‌లో సంగీత దర్శకుడితో ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇక, జూలై 28న BRO మూవీ రిలీజ్ కాబోతుంది. అంటే రెండు రోజుల వ్యవధిలో ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ రాబోతుంది. దీనిపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సరసన తమన్నా భాటియా నటిస్తుండగా.. కీర్తి సురేష్, సుశాంత్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బ్రహ్మానందం, శ్రీముఖి, రష్మీ గౌతమ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











