Bhola Shankar: చిరంజీవి మూవీ మళ్లీ వాయిదా.. వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొత్తగా, ఉత్సాహంగా కనిపిస్తూ.. వరుస పెట్టి మూవీల మీద మూవీలు చేసుకుంటూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఏకధాటిగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఇప్పటికీ తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. దీనికితోడు గత సంక్రాంతికి మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'వేదాళం' మూవీకి రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఈ సినిమా షూటింగ్ పోయిన ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిరంజీవి కమిట్‌మెంట్స్‌తో పాటు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ అనుకున్న విధంగా సాగట్లేదు. కానీ, ఇప్పుడు మాత్రం షూటింగ్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

వాస్తవానికి 'భోళా శంకర్' మూవీని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీకి దీన్ని వాయిదా వేశారు. అయితే, ఇప్పుడు ఈ డేట్‌కు కూడా ఈ సినిమా రావట్లేదని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా చిత్ర యూనిట్ ఓ వీడియోను షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. అందులో కొత్త షెడ్యూల్ కోసం చిరంజీవి అండ్ టీమ్ కోల్‌కతాలో ల్యాండ్ అయింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. అలాగే, ఇందులోనే ఈ మూవీని ఆగస్టు 11నే రిలీజ్ చేస్తున్నట్లు చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు.
ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











