Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Bhumika Chawla ఎమోషనల్ పాత్రలో భూమికా చావ్లా.. సీతారామంలో ఫీలుగుడ్ లుక్‌తో..!
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ థాకూర్ తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమవుతున్న చిత్రం సీతా రామమ్. ఫీల్‌గుడ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు పెరిగాయి. ఇటీవల మల్లారెడ్డి కాలేజ్‌లో రిలీజ్ చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానున్న కల్యాణం పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఇలాంటి అంచనాలు పెరిగిన సమయంలో భూమికా చావ్లా పోషించిన పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
భూమికా చావ్లాను పరిచయం చేస్తూ వదిలిన పోస్టర్‌లో మృణాళిని మిసెస్ విష్ణు శర్మ అనే ట్యాగ్ లైన్ ఆసక్తిని రేపింది. సినిమా టైటిల్‌కు తగినట్టగానే ఈ పోస్టర్‌లో ఫీల్ ఎమోషన్స్ కనిపించాయి. చిన్నపాపను ఒడిలో ఉంచుకొని చిరునవ్వు చిందిస్తూ భూమికా చావ్లా కనిపించింది.

భూమికా చావ్లా విషయానికి వస్తే.. ఆమె కెరీర్‌లో సెకండ్ ఇన్సింగ్స్ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఎంసీఏ చిత్రంలో మంచి పాత్రను పోషించిన భూమికా మరోసారి ఫీల్‌గుడ్ పాత్రలో మెప్పించడానికి సిద్దవుతున్నారు. అయితే మృణాళిని భర్త విష్ణుశర్మ ఎవరు? వారి బంధంలో ఉన్న ప్రేమ, అప్యాయతలు ఏమిటనే ఆగస్టు 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది.
నటీనటులు:
దుల్కర్
సల్మాన్,
మృణాల్
థాకూర్,
రష్మిక
మందన్న,
సుమంత్,
తరుణ్
భాస్కర్,
గౌతమ్
వాసుదేవ్
మీనన్,
భూమికా
చావ్లా
తదితరులు
రచన,
డైలాగ్స్,
దర్శకత్వం:
హను
రాఘవపూడి
నిర్మాత:
అశ్వినీదత్
సినిమాటోగ్రఫి:
పీఎస్
వినోద్,
శ్రేయాస్
కృష్ణ
ఎడిటర్:
కోటగిరి
వెంకటేశ్వరరావు
మ్యూజిక్:
విశాల్
చంద్రశేఖర్
బ్యానర్:
వైజయంతి
మూవీస్,
స్వప్న
సినిమాస్
రిలీజ్
డేట్:
2022-08-05