ప్రభాస్ అక్కగా పవన్ హీరోయిన్: లేట్ అయినా లక్కీ ఛాన్స్ పట్టేసిందిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలతో సందడి చేసి.. స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో ఇంటర్నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి భారీ చిత్రాల్లోనే భాగం అవుతూ సత్తా చాటుతోన్నాడు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని వార్తలు కూడా లీక్ అయ్యాయి. ఆ తర్వాత షూట్ ప్రారంభోత్సవం, ఫస్ట్ షెడ్యూల్ గురించి కూడా ఎంతో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీ జరిగాయని ప్రచారం జరిగింది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారనే కూడా టాక్ వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త లీకైంది. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ప్రభాస్‌కు సోదరిగా భూమిక చావ్లా నటిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా జరిపిందని తెలిసింది. ఇందుకు ఆమె పచ్చజెండా ఊపడంతో పాటు డేట్స్ కూడా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఇందులో ప్రభాస్‌కు, భూమికకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా సాగుతాయని తెలుస్తోంది. త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొనబోతుందని సమాచారం.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











