SSMB 29: మహేష్ బాబు కోసం రాజమౌళి టీంలో భారీ మార్పులు.. ఎవరెవరిని తొలగించారంటే?

RRR సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జక్కన్నతో అది కూడా మహేష్ బాబు సనిమా రాబోతుందని తెలిసినప్పటి నుంచి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుండగా.. రాజమౌళి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు కోసం రాజమౌళి టీంలో అనేక మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని తెలిసినప్పటి నుంచి అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లూ గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న ఆయన పది రోజుల నుంచి ఫ్రీ అయిపోయారు. ముఖ్యంగా ఇటీవలే SSMB29 సినిమా కోసం ఆయన విదేశాలకు వెళ్లారు. ఆదివారం రోజే వచ్చారు. మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుకు ఇది 29వ సినిమా కాబట్టి దీనికి ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.

 Big Changes in Rajamouli Team For Mahesh babu SSMB 29 Film Check Details

అయితే ఈ సినిమా ఆఫ్రికన్ జంగిల్ నుంచి యాక్షన్ అడ్వెంచర్ కాబోతుందని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు కోసం.. డైరెక్టర్ రాజమౌళి తన టీంలో అనేక మార్పులు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా సెంథిల్ కుమార్ స్థానంలో PS వినోద్ ను తీసుకోబోతున్నారట. అలాగే వీఎఫ్‌ఎక్స్ సూపర్‌ వైజర్ శ్రీనివాస మోహన్ స్థానంలో కమల్ కన్నన్ నియమితులు అయినట్లు తెలుస్తోంది.

వీరిద్దరు మాత్రమే కాకుండా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ను, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ స్థానాన్ని భర్తీ చేయాలని డైరెక్టర్ రాజమౌళి అనుకుంటున్నారట. అయితే ముందుగా అనుకున్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రచయిత విజయేంద్ర ప్రసాద్ లను కొనసాగించాలని అనుకుంటున్నారట. వీరిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశమే లేనట్లు తెలుస్తోంది. SSMB29 సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలపై భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 Big Changes in Rajamouli Team For Mahesh babu SSMB 29 Film Check Details

మహేష్ బాబుతో తీయబోయే ఈ కొత్త చిత్రానికి మాత్రం బాహుబలి సినిమాకు రెండింతల బడ్జెట్ ఉండబోతుందట. మొత్తం 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ గా తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతికి నిపుణులను కూడా భాగస్వామం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ బజ్ ఏర్పడింది. అసలు పూజా కార్యక్రమాలు కూడా మొదలెట్టకుముందే ఈ రేంజ్ లో హైప్ అందుకుంటున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X