Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' ఈ ఎడాది లేనట్లే.. నష్టాలు తప్పవా?
టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఊహించని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఫిదా లాంటి హిట్టు సినిమా చేసిన తరువాత కుడా వరుసగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. భారీ ఆశలతో మొదలుపెట్టిన లవ్ స్టోరీ సినిమా పరిస్థితి క్లిష్టంగానే మారింది.
అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆ సినిమా యొక్క షూటింగ్ పార్ట్ ఇంకొంచెం మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఆ షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు మరింత భయంకరంగా మారడంతో ఇప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
సినిమాకు సంబంధించిన బిజినెస్ డీలింగ్స్ పై కూడా ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడే నిర్మాతకు అన్ని ఏరియాల నుంచి బిజినెస్ డీలింగ్స్ కి సంబంధించి అడ్వాన్స్ లు అందాయట. అయితే ఇప్పుడు డబ్బు ఇచ్చిన బయ్యర్లు రిస్క్ చేయలేమని డబ్బు వెనక్కి ఇచ్చేయాలని బ్రతిమాలుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే లవ్ స్టోరీ షూటింగ్ ని పూర్తి చేయాలంటే ఈ ఎడాది చివర వరకు సమయం పట్టవచ్చు. ఇక సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసుకోవాల్సిందే. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటే పెద్ద సినిమాలతో కాస్త పోటీ పడక తప్పదు. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల వస్తుందో చూడాలి.