పుష్ప 'ఆహా' సొంతమేనా.. నిర్మాతలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఓటీటీ సంస్థలు
అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బన్నీ సినిమాను చాలా కాస్ట్లీగా రెడీ చేస్తున్నారు. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు కాబట్టి డైరెక్టర్ పై పెద్ద భారామే పడింది.
ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు సుకుమార్. అయితే ఇప్పటివరకు 30 శాతం షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. పక్కా ప్లాన్ తో అనుకున్నట్లు సమయానికి తగ్గట్టుగా షూటింగ్ పనులను పూర్తి చేస్తేనే రిలీజ్ డేట్ కు సినిమా రెడీగా ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యం అయినా మళ్ళీ వాయిదా తప్పదు. ఇక సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన బిజినెస్ డీలింగ్స్ పై ఇటీవల నిర్మాతలు పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇక సినిమా ఓటీటీ రైట్స్ అనగానే అందరూ అల్లు అర్జున్ హోమ్ సంస్థ 'ఆహా'కే వెళుతుందని అనుకుంటున్నారు. పాన్ ఇండియా లాంటి సినిమా పడితే ఆహా వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోవడం కాయం. కానీ పోటీగా అమెజాన్, హాట్ స్టార్ వంటి సంస్థలు చాలా బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి ఫోకస్ అంతా కూడా నిర్మాతలపైనే ఉంది. గత కొన్ని రోజులుగా డీలింగ్స్ పై చర్చలు గ్యాప్ లేకుండా కొనసాగుతున్నాయట. మరి అల్లు అర్జున్ ఈ డీలింగ్ పై నిర్మాతలతో ఏదైనా మాట్లాడతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











