‘ఖిలాడీ’ కోసం పోటీ పడుతోన్న ఓటీటీలు: రవితేజకు భారీ డీల్ ఇచ్చిన ప్రముఖ సంస్థ

ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో వచ్చిన 'క్రాక్'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అప్పటి వరకు ఉన్న హిట్ల దాహాన్ని ఈ సినిమాతో తీర్చుకున్న అతడు.. కలెక్షన్ల పరంగానూ కెరీర్‌లోనే బెస్ట్ ఫిగర్లను అందుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఫుల్ స్వింగ్‌తో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి భారీ ఆఫర్ వచ్చినట్లు ఓ న్యూస్ లీకైంది.

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న చిత్రమే 'ఖిలాడీ'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఇప్పటి వరకూ తీసిన ఎపిసోడ్స్ అన్నీ సంతృప్తికరంగానే వచ్చాయట. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఖిలాడీ మూవీని నేరుగా రిలీజ్ చేసుకునేందుకు ఓ ప్రముఖ సంస్థ ఏకంగా రూ. 45 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే, చిత్ర యూనిట్ మాత్రం దీనికి నిరాకరించినట్లు సమాచారం.

Big OTT Offer for Ravi Tejas Khiladi Movie

రవితేజకు బయట మాస్ ఆడియెన్స్ నుంచి ఫాలోయింగ్ భీకరంగా ఉంటుంది. కాబట్టి.. ఈ సినిమాను ఆలస్యం అయినా థియేటర్లలోనే విడుదల చేయాలని చూస్తున్నట్లు, అందుకే ఓటీటీ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X