రానా ‘విరాట పర్వం’ మూవీకి భారీ ఆఫర్: చిత్ర యూనిట్ డేరింగ్ డెసీషన్

టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం'. సున్నితమైన ప్రేమకథతో 90 దశకం నాటి వాతావరణంతో రూపొందిందీ సినిమా. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల రూపొందించాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఈ మధ్యనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. అయితే, అంతలోనే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభించడంతో ఈ సినిమా విడుదలను ఆపేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

వాయిదా పడిన తర్వాత 'విరాట పర్వం' సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారని చాలా రోజుల పాటు ప్రచారం జరిగింది. ఆ సమయంలో దీనిపై స్పందించిన దర్శకుడు వేణు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ తాజాగా భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. తమ ప్లాట్‌ఫాంలో నేరుగా విడుదల చేసుకుంటామని చిత్ర యూనిట్‌తో మంతనాలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.

Big OTT Offer to Rana Daggubatis Virata Parvam

సదరు సంస్థ ఆఫర్‌ను 'విరాట పర్వం' యూనిట్ సున్నితంగా తిరస్కరించినట్లు కూడా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకం వల్లే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్‌లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X