‘సలార్’ కోసం ప్రభాస్ పక్కా ప్లాన్: మళ్లీ అదే పంథాను ఫాలో అవుతోన్న హీరో
కొంత కాలంగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' తర్వాత పంథాను మార్చుకున్న అతడు.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' చిత్రంతో తన స్టామినాను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎప్పుడో రెగ్యూలర్ షూటింగ్ మొదలైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తాజాగా దీని గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీ సెకెండ్ షెడ్యూల్‌ను గుజరాత్‌లో ప్లాన్ చేశారు. అయితే, కరోనా రెండో దశ కారణంగా అది కాస్తా వాయిదా పడిపోయింది. ఇక, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో షూటింగ్‌ను పున: ప్రారంభించాలని యూనిట్ డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఏర్పాటు చేస్తున్నారట. ఇవి పూర్తైన వెంటనే అంటే మరో వారం రోజుల్లో చిత్రీకరణను మొదలు పెడతారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ సీక్వెన్‌ను షూట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో జరిగిన మొదటి షెడ్యూల్‌లోనూ ఫైట్ సీన్‌నే షూట్ చేసిన విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో అతడు తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడట. ఇధి 1970 నాటి కథతో సాగే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతుంది. ఇక, ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు


Click it and Unblock the Notifications











