ఆలియాభట్ ఇంట్లోకి పాము దూరి.. ఊహించని అతిథి అంటూ పోస్టు
బాలీవుడ్ నటి అలియాభట్ స్విమ్మింగ్ పూల్‌లోకి పాము రావడం కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్ వద్ద కనిపించిన పాముకు సంబంధించిన వీడియోను ఆలియాభట్ తల్లి సోని రజ్దాన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. పొడవాటి పాము స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ జాలీగా చక్కర్లు కొట్టింది. ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధించి తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టింది.
మా ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లోకి ఓ అతిథి వచ్చారు. ముందుగా నీళ్లు తాగాలని చూసింది. ఆ తర్వాత నీటీలో మునకవేసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది. స్నేక్ ఇన్ ది వాటర్ అంటూ కామెంట్‌తో పోస్టు చేసింది. సోని రజ్దాన్ పోస్టుపై రణ్‌బీర్ కపూర్ తల్లి చాలా భయంగా ఉంది అంటూ కామెంట్ పెట్టింది.

ఇంట్లోకి వచ్చిన అతిథిని సోని రజ్దాన్ చక్కగా వెంటాడినట్టు కనిపించింది. పలు రకాలుగా వీడియోలు తీసి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. స్నేక్ ఇన్ ది వాటర్ పార్ట్ 2 అంటూ కామెంట్ పెట్టారు.
ఇక అలియా భట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం RRR మూవీలో నటించడం ద్వారా దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా షూటింగులు ఆగిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ ఫ్యామిలీతో కలిసి వారి విషాదాన్ని పంచుకొంటున్నది. ఇటీవల రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











