AA22xA6 : అల్లు అర్జున్ అట్లీ మూవీ నుంచి బిగ్ సర్ ప్రైజ్.. హీరోయిన్ గా కాంట్రవర్షియల్ బ్యూటీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ 'పుష్ప2' తో చిత్రంతో ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్ గా తన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా రూ.1870 కోట్లు వసూళ్లు చేసి దుమ్ములేపారు. దీంతో అల్లు అర్జున్ బడా హీరోగా మారిపోయారు. ఆయన సినిమాలకు కూడా భారీ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన రాబోయే 22వ చిత్రాన్ని కూడా పాన్ వరల్డ్ చిత్రంగా, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇప్పటికే AA22xA6 వర్క్ టైటిల్ తో అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్యలో ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు చకచకా నడుస్తున్నాయని తెలియజేస్తూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో అవెంజర్స్, అక్వామెన్, స్పైడర్ మ్యాన్ వంటి చిత్రాలకు పని చేసిన గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ నిపుణులు అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ కు పని చేయబోతున్నారని తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా బిగ్ సర్ ప్రైజ్ ను అందించారు.. ఆ వివరాల్లోకి వెళితే..

Big Surprise from Allu Arjun Atlee Upcoming Movie AA22xA6

కొద్ది రోజులుగా ఈచిత్రానికి సంబంధించిన హీరోయిన్లపై చిత్ర పరిశ్రమలో, డిజిటల్ మీడియంలో తెగ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ చిత్రంలో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. దీంతో AA22xA6 ప్రాజెక్ట్ కు హీరోయిన్ గా ఎవరని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఇక తాజాగా మేకర్స్ AA22xA6 మూవీకి సంబంధించిన హీరోయిన్ గా దీపికా పదుకొణెను అధికారికంగా అనౌన్స్ చేశారు. దీపికా పదుకొణె అల్లు అర్జున్ సరసన నటించబోతుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

AA22xA6 నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ ను ఇస్తూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన హిట్స్ ను కూడా వదిలారు. యుద్ధాన్ని జయించడానికి రాణి కవాతు చేసిందని చెబుతూ దీపికా పదుకొణెకు AA22xA6 ప్రాజెక్ట్ లోకి స్వాగతం పలికారు. ఇక అట్లీ దీపికా పదుకొణెకు స్క్రిప్ట్ ను పూర్తిగా నేరెట్ చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. అట్లీ కథ చెబుతున్న క్రమంలో దీపికా చాలా ఆసక్తిని కనబరిచింది. షూట్ కు సిద్ధంగా ఉన్నట్టుగా అట్లీకి చెప్పింది.

ఇక దీపికా పదుకొణెతో కూడా అట్లీ లుక్ టెస్ట్ ను నిర్వహించారు. భారీ విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్న చిత్రం కావడంతో షూట్ కు సంబంధించిన వివరాలను, టెక్నాలజీని, షూట్ చేయబోయే విధానాన్ని దీపికాకు అట్లీ పూర్తిగా వివరించారు. ఇక త్వరలోనే షూట్ ప్రారంభం కానుందని, సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులు, ఆడియెన్స్ కు తెలియజేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ కు మరో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఫైనల్ అయ్యింది. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. ఇఖ ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూ. 800 కోట్లతో నిర్మించబోతున్నారు. సాయి అభ్యాంకర్ ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X