షాకింగ్ ట్విస్ట్ .. అన్నతో పాటు తమ్ముడు కూడా .. అక్కినేని ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్
భారత్‌లోని ప్రతీ సినీ ఇండస్ట్రీలోనూ సినీ తారలు వారి వివాహ జీవితాలు ఒకింత ఆశ్చర్యకరంగానే ఉంటాయని చెప్పాలి. ఎవరో ఒకరు ఇద్దరు స్టార్స్ మినహా మిగతా చాలా మంది సినీ నటీనటుల జీవితాల్లో పెళ్లిళ్లు, ఇతర రిలేషన్ షిప్స్ అంటూ చాలా వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకొని, విడిపోయిన జంటలు కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమలో లేకపోలేరు.
ఐతే ఇప్పుడు మన టాలీవుడ్ లో వినిపిస్తున్న పలు క్రేజీ న్యూస్‌లలో అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజాల సందడి కూడా ఒకటని చెప్పాలి. ఎన్నో విపత్కర పరిస్ధితుల మధ్య యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఓ పక్క తన పెళ్లి సహా తన మాజీ భార్య సమంతలు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ నాగ చైతన్య అండ్ అక్కినేని ఫ్యామిలీ మాత్రం తమ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇపుడు నాగార్జున కూడా ఈ పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అని, ఫారిన్‌లో పెళ్లి అని ఏవేవో గాసిప్స్ వైరల్ అవుతుండగా హైదరాబాద్ లోనే అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి జరగనుంది. టాలెంటెడ్ నటి శోభిత ధూళిపాళని చైతూ పెళ్లి చేసుకోనున్న ఈ తరుణంలో అక్కినేని ఫ్యామిలీలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ పక్క అన్న నాగ చైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే ఇంకో పక్క తమ్ముడు అఖిల్ అక్కినేని కూడా తన పెళ్లి పనుల్లో ఉన్నట్టుగా వార్తలు బయటికొచ్చాయి.
ఇది మాత్రం ఊహించని ట్విస్టే అని చెప్పాలి. గతంలోనే నాగ చైతన్య అలాగే అఖిల్ అక్కినేని పెళ్లి విషయంలో ఒక పక్క చైతు పెళ్లి, ఇంకో పక్క అఖిల్‌కి అప్పుడు కింగ్ నాగ్ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ చేశారు. ఆ వార్తలు అప్పట్లో మంచి వైరల్ గా కూడా మారాయి. కానీ ఇపుడు షాకింగ్ గా మళ్ళీ నాగ చైతన్య పెళ్లి పనుల్లో ఉన్నపుడే అఖిల్ అక్కినేని కూడా సైలెంట్ గా తన ఎంగేజ్మెంట్ ని ముగించుకున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో వార్తలు పొక్కాయి.
అభిమానులు కానీ, చిత్ర పరిశ్రమకు కానీ ఇది ఊహించని ట్విస్ట్ గా మారింది అని చెప్పాలి. అఖిల్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ సైలెంట్ గా చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి ? అనేదానిపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్న సమయంలోనే అఖిల్ తండ్రి, టాలీవుడ్ అగ్ర కథా నాయకుడు నాగార్జున స్వయంగా రివీల్ చేసారు. దీనితో ఓ పక్క అన్నయ్యతో పాటుగా మళ్ళీ తమ్ముడు పెళ్ళికి సంబంధించిన వార్తలు రావడం అనేది అక్కినేని ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి.
అఖిల్, జైనబ్ రావ్డ్జీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా నాగార్జున అధికారికంగా ప్రకటించారు. నాగ చైతన్య పెళ్లి పనుల్లోనే ఈ వార్తని కూడా షేర్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. అయితే అఖిల్ అక్కినేని నుంచి కూడా ఓ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ అయితే బాగుండు అని అయ్యగారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఏకంగా అఖిల్ పెళ్లిపై ఇలాంటి వార్త వింటాం అని బహుశా చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications











