Karthika Deepam నీ ప్రియుడికి నీకు అడ్డొస్తున్నానని చంపేస్తావా? మోనితకు కార్తీక్ షాక్

మోనితను ఇరికించే ప్రయత్నం చేస్తూ.. నీకు కార్తీక్ జన్మదినం గుర్తులేదా అంటే.. కార్తీక్ బర్త్ డే కాదని అబద్ధం ఆడితే.. ఆధార్ కార్డు.. మరో ప్రూఫ్ తీసుకొస్తే మరింత ప్రమాదం.. అని అనుకొంటుండగా.. ఏదో ఆలోచస్తున్నావు డాక్టరమ్మ అని దీప మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. గుర్తుంది అంటూ మోనిత అంటే.. మరీ నాకు విషెస్ చెప్పలేదు అంటూ కార్తీక్ నిలదీశాడు. కవరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావా అంటే ప్రశ్నించాడు. నీకు నిజంగా గుర్తు ఉండే.. ఎంత హడావిడి చేసేదానివో అని కార్తీక్ షాకిచ్చాడు. గుర్తు చేసిన తర్వాత కూడా విషెస్ చెప్పలేదు చూడు అంటూ కార్తీక్ మరో షాక్ ఇచ్చాడు. దాంతో హ్యాపీ బర్త్ డే అంటూ చెబితే.. నీతో అడిగి చెప్పించుకోవాల్సిన అవసరం లేదంటూ కార్తీక్ అన్నాడు. అయితే మోనిత నీ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ఏర్పాటు చేయలేదు. కాబట్టి.. మా ఇంటి వద్ద చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. మీరు రండి అంటూ కార్తీక్‌ను దీప ఆహ్వానించారు. ఆ తర్వాత కార్తీక్ దీప ఇంటికి వెళ్తే.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్ జరిపారు. కేక్ కట్ చేసిన తర్వాత నీకు గిఫ్టు అంటూ పర్సును బహుకరించింది. ఈ గిఫ్టు నీకు గుర్తుందా.. గతేడాది పుట్టిన రోజున నేను నీకు ఇచ్చాను. అందులో స్లిప్ కూడా ఉంది చూడు.. ఆ స్లిప్‌పై నీకు విషెస్ కూడా అందించాం అని దీప చూపించింది.

Karthika Deepam

అయితే మోనితను ప్రశ్నిస్తూ.. గతేడాది దీప వచ్చి పర్సు గిఫ్టు ఇస్తే.. నీవేమి చేస్తున్నావు అని కార్తీక్ అంటే.. పక్కనే ఉన్న డాక్టర్ తల్లి.. గతేడాది కూడా నీవు కార్తీక్ బర్త్ డే మరిచిపోయావా? ఏడాది మాదిరిగానే చేశావా? అసలు నీవు ఉన్నావా అని ఎగతాళి చేసింది. అయితే నాకు అంతా గుర్తు ఉంది.. టైమ్ అయిపోతుంది.. వెళ్దాం పద అని కార్తీక్‌ను మోనిత తొందర చేసింది. దాంతో డాక్టర్ బాబు మీరు వెళ్లండి.. పొద్దునే లేవాలి.. మీరు ఉదయం రండి అంటూ పంపించింది.

ఉదయమే దీప లేచి గుడికి వెళ్దామని తయారై మోనిత ఇంటికి వెళ్తే.. అక్కడ ఎవరూ లేకపోవడంతో దీప కంగారు పడింది. ఇళ్లంతా వెతికి.. కార్తీక్‌ను మోనిత ఎక్కడికైనా తీసుకెళ్లిపోయిందా అనే అనుమానం వ్యక్తం చేసింది. అయితే డాక్టర్ బాబు లేరంటూ ఎదురుగా వచ్చిన డాక్టర్‌తో కంగారు పడింది. డాక్టర్ బాబును ఎక్కడికైనా తీసుకెళ్లిందా అంటూ ప్రశ్నించింది. అయితే ఇళ్లు ఖాళీ చేయకుండా వెళ్తుందా. పుట్టిన రోజు నీతో గడపకుండా ఏదో ప్లాన్ చేసి ఉండి ఉంటుంది అని డాక్టర్ సముదాయించే ప్రయత్నం చేశాడు.

కార్తీక్‌ను కారులో తీసుకొని మోనిత బయలుదేరింది.. ఈ రోజు నేను కార్తీక్‌తో నేను గడుపుతా అని మోనిత మనసులో అనుకొన్నది. అయితే కారు డ్రైవ్ చేస్తూ.. నీవు నా బర్త్ డే మరిచిపోయావా? అని కార్తీక్ అడిగాడు. అయితే ఆ ప్రశ్నను మళ్లీ మళ్లీ అడగకు. అదే విషయాన్ని ఎందుకు లాగుతావు అని మోనిత అంది. ఇంతకు ముందు నీతో ఎలా ఉండేవాడిని. నిన్ను ఇలా ప్రశ్నలతో వేధించే వాడినా? లేక ఏది చెప్పితే తలాడించే వాడినా అని కార్తీక్ అంటే.. ఇక ఆపు అంటూ మోనిత అరిచింది.

ఇక బర్త్ డే టాపిక్ పక్కన పెట్టి.. ఇంతకు నీ ఫ్రెండ్ ఏమైపోయాడు. నిన్ను వదిలిపెట్టి ఉండే వాడు కాదు కదా.. అని అంటే.. నన్ను అనుమానించే ప్రశ్నలు వేయకు అని మోనిత అంది.. అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు.. నీకు దుర్గకు మధ్యలో అడ్డు వస్తున్నానని నన్ను ఏమైనా చేయడానికి తీసుకెళ్తున్నావా? నీకు అడ్డం వస్తుంటే చెప్పు.. మీ ఇద్దరి మధ్య నుంచి నేను తప్పుకొంటాను అని మోనితకు షాకిచ్చాడు. దాంతో కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు.. అని మోనిత అరిచింది. అంటే.. ఈ మధ్య ఇలాంటి వార్తలు వింటున్నాను. ప్రియుడికి అడ్డొస్తున్నానని భర్తను చంపిన భార్య అనే వార్తలు వింటున్నాను అని కార్తీక్ అంటే.. స్టాపిట్ అని మోనిత అరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X