Monalisa: ఊహించని ట్విస్ట్.. కుంభమేళ మోనాలిసాకు బిగ్ షాక్.. భర్తపై ఆ కేసు..

Monalisa: సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన 'మహాకుంభ్' వైరల్ గర్ల్ మోనాలిసా.. ఈ అమ్మడు వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకున్న ఈ యువతి... ఇప్పుడు మైనర్ అనే విషయం బయటపడడంతో కేసు వరకు వెళ్లడం సంచలనం సృష్టించింది. మోనాలిసా భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రమైంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా... మహాకుంభ మేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె అందం, ముఖ్యంగా 'తేనె కళ్లతో' నెటిజన్లను ఆకట్టుకుని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఈ క్రేజ్ కారణంగా సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సమయంలోనే ఫర్మాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి వివాహం వరకు వెళ్లింది. కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో... ఇద్దరూ కేరళలోని పూవార్ ప్రాంతంలో ఉన్న ఆలయంలో మార్చి 11న వివాహం చేసుకున్నారు.

Big Twist in Monalisa Love Marriage Case POCSO Case Filed Against Husband

అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మోనాలిసా వయస్సుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (NCST) విచారణ చేపట్టింది. అధికారిక ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించిందని తేలింది. అంటే పెళ్లి సమయంలో ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఆమె మైనర్ అని కమిషన్ స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా మోనాలిసా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందినది కావడంతో ఇతర చట్టాల కింద కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇక పెళ్లి కోసం తప్పుడు పుట్టిన తేదీతో బర్త్ సర్టిఫికేట్ తయారు చేసినట్లు కూడా విచారణలో బయటపడటం కేసును మరింత క్లిష్టంగా మార్చింది.

మరోవైపు, ఈ వివాహం మొదటి నుంచే వివాదాస్పదంగా మారింది. వేర్వేరు మతాలకు చెందిన ఈ జంట పెళ్లిని కొందరు "లవ్ జిహాద్"గా ఆరోపించగా... మరికొందరు వారి వ్యక్తిగత నిర్ణయంగా మద్దతు ఇచ్చారు. పెళ్లి సమయంలో కేరళ రాజకీయ నాయకులు హాజరుకావడం కూడా ఈ ఘటనకు మరింత ప్రాధాన్యత తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక వివాహ వివాదం మాత్రమే కాదు... చట్టపరమైన, సామాజిక, రాజకీయ కోణాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా మైనర్ వివాహం, ఫేక్ డాక్యుమెంట్స్ వినియోగం, మతాంతర వివాహాలపై వివాదం అన్ని కలిసి ఈ ఘటనను మరింత సున్నితంగా మార్చాయి.

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫర్మాన్ ఖాన్‌పై నమోదైన కేసులు ఏ దిశగా వెళ్తాయి? మోనాలిసా నిజంగా మైనరేనా? లేక ఇందులో మరిన్ని కోణాలు ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే... ఓ సాధారణ పూసలు అమ్మే అమ్మాయి నుంచి స్టార్‌గా ఎదిగిన మోనాలిసా జీవితం... ఇప్పుడు ఒక్కసారిగా వివాదాలు, పోలీస్ కేసుల మధ్య చిక్కుకుపోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Read more about: monalisa bollywood kerala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X