Singer Mangli: సింగర్ మంగ్లీ కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి!
టాలీవుడ్ టాప్ సింగర్ గా కొనసాగుతున్న సింగర్ మంగ్లీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన గాత్రంలో అందిరనీ ఉర్రూతలూగించే ఈమెకు ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ రోడ్డు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ఘటనలో గాయపడ్డ సింగర్ మంగ్లీయే నేరుగా సోషల్ మీడియా వేదికగా ఈ ప్రమాదం గురించి క్లారిటీ ఇచ్చింది. అలాగే పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బతుకమ్మ పాటలు, పండుగలు, పబ్బాలకు అద్భుతమైన వీడియో సాంగ్స్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించింది సింగర్ మంగ్లీ. ముఖ్యంగా ప్రతీ ఏటా సరికొత్త పాటలతో వస్తూ అస్సలే బోర్ కొట్టకుండా చేస్తున్న ఈమె ఇటీవల కాలంలో వరుసగా ఆఫర్లు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఓవైపు సినిమాల్లో, ప్రైవేట్ ఆల్బమ్స్ లో వరుసగా పాటలు పాడుతూనే.. సూపర్ సింగర్ షోలో జడ్డిగా కూడా చేసింది.

అయితే తాజాగా ఈరోజు ఈమె వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.. అందులో ఈమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఉదయం నుంచి అన్ని న్యూస్ ఛానెళ్లు, వెబ్ సైట్లలో ఈ వార్త సర్క్యులేట్ అవుతోంది. ముఖ్యంగా ఈమె రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై వస్తుండగా ప్రమాదం జరిగందని.. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించారంటూ ప్రచారం సాగింది.
కానీ వటిపై తాజాగా సింగర్ మంగ్లీ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని... కొన్ని రోజుల క్రితం తన కారు ప్రమాదానికి గురైన మాట వాస్తవమే అయినా అది చాలా చిన్న యాక్సిడెంట్ అని క్లారిటీ ఇచ్చింది. దాని వల్ల తనకు ఎలాంటి గాయాలు కాలేవని.. ప్రస్తుతం తాను చాలా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ పుకార్లను ఎవరూ నమ్మొద్దని.. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ అంటూ వివరించింది.
మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. 'శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకొచ్చారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టిందని తెలిపారు. కారులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని.. కారు ఇండికేటర్ మాత్రమే పగిలిందని ఇది కూడా ఈరోజు జరిగింది కాదని.. కొన్నాళ్ల క్రితం జరిగిందని వివరించారు.


Click it and Unblock the Notifications











