Prabhas సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్: ఏది రాబోతుందన్న దానిపై సస్పెన్స్!
ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల్లోనే నటిస్తూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచి చిన్న, మధ్య తరహా చిత్రాల్లోనే నటించిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఒకదాని తర్వాత ఒకటి భారీ బడ్జెట్ మూవీల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే 'సాహో' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను మొదలు పెట్టాడు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్ వంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న వెంటనే కరోనా సెకెండ్ వేవ్ రూపంలో ఆటంకం ఎదురైంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ప్లానింగ్‌ను మొత్తాన్ని మార్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాజాగా ఇప్పుడు మరో షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు.

'సలార్' రెండో షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' మూవీ నుంచి త్వరలోనే ఓ భారీ ప్రకటన రాబోతుందట. అందుకే ఈ సినిమా టైటిల్ హాట్ టాపిక్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అప్‌డేట్ అయితే రాబోతుంది కానీ, అది దేనికి సంబంధించింది అనే దానిపై మాత్రం ఎటువంటి స్పష్టత రావడం లేదు. అసలు ఏది రివీల్ చేయబోతున్నారో అర్థం కావడం లేదు. దీంతో ప్రభాస్ సినిమా ప్రకటన కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో అతడు తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని కూడా అంటున్నారు. ఇధి 1970 నాటి కథతో సాగే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతుంది. ఇక, ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఓ స్టార్ హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తుందనే టాక్ బాగా వినిపిస్తోంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











