బిగ్‌బాస్ 3 ఇంటి కెప్టెన్ ఎవరో తెలుసా? హౌస్‌లో తొలి నాయకుడిగా
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఇంటి సభ్యులకు కొత్త నాయకుడు వచ్చేశాడు. ఇంటి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ ఎంపికయ్యాడు. కెప్టెన్ టాస్క్ కోసం బిగ్‌బాస్ గురువారం ఎపిసోడ్‌లో పవర్ గేమ్ టాస్క్‌ను ఆడించాడు. ఆ గేమ్‌లో గెలిచిన వ్యక్తులు కెప్టెన్ పదవికి ఎంపికవుతారని చెప్పారు. ఈ క్రమంలో ఇంటిలో కెప్టెన్ ఎంపిక కోసం పవర్ గేమ్ టాస్క్‌ను బిగ్‌బాస్ నిర్వహించాడు.

పవర్ గేమ్‌లో భాగంగా ఇంటి లాన్‌లో ఓ కిరీటం, డైమండ్ పెట్టి.. బజర్ మోగగానే వాటిని ముట్టుకొన్న వ్యక్తి ఇంటి పెద్దగా వ్యవహరించే అవకాశం దక్కుతుంది. మొదటి బజర్ మోగగానే వరుణ్ సందేశ్ డైమండ్‌ను పట్టుకొన్నాడు. దాంతో మొదటి ఇంటి పెద్దగా వరుణ్ వ్యవహరించాడు. ఇంటి సభ్యులతో డ్యాన్సులు వేయించాడు.
ఇక పవర్ టాస్క్‌లో డైమండ్‌ను సొంతం చేసుకొన్న ముగ్గురు పదవి కోసం పోటీపడ్డారు. ఈ పోటీలో వరుణ్ సందేశ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. బిగ్‌బాస్ 3 సీజన్‌లో ఈయనే తొలి కెప్టెన్. ఇంటికి సంబంధించిన వ్యవహారాలను బిగ్‌బాస్ వరుణ్ చేతిలో పెట్టాడు. దాంతో ఈ ఎపిసోడ్ గందరగోళం మధ్య ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications











