Geetu Royal: గీతూ రాయల్‌కు కొడుకు ఉన్నాడట.. గుట్టుగా ఉంచడం వెనుక కారణం అదేనా?

గలాటా గీతూ, గీతూ రాయల్.. బిగ్ బాస్ బిగ్ ఫైర్ బ్రాండ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం.. అంతకు మించిన మాటలు... అసలైన చిత్తూరు యాసతో అదరగొట్టే ఈ అమ్మాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ గా వెళ్లింది. అద్భుతమైన ఆట తీరు కనబర్చి అనేక మంది అభిమానులను సంపాధించుకుంది. బిగ్ బాస్ రీవ్యూయర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ.. బిగ్ బాస్ కు రావడం ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ షోలో ఇంటర్వ్యూలు చేయడం నిజంగా గ్రేటే.

అయితే బిగ్ బాస్ బజ్ షోలో ముక్కుసూటిగా ప్రశ్నలు అడుగుతూ.. కంటెస్టెంట్లను ఓ ఆట ఆడుకుందీ క్యూట్ బ్యూటీ. ముందు ఉన్నది ఎవరు అనేది చూడకుండా తాను అడగాలనుకున్నవన్నీ అడిగేసి అందరినీ అదరగొట్టి, బెదరగొట్టింది. అయితే ఈ తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ షాకింగ్ కామెంట్లు చేసింది. తన కెరియర్ గురించి మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా చెప్పి షాకిచ్చింది. ఆమె బిగ్ బాస్ తెలుగు 6కు వచ్చినప్పటికి ఆమెకు పెళ్లి కాలేదు. 2021వ సంవత్సరం ఫిబ్రవరిలో వికాస్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లైంది.

Bigg Boss Beauty Geetu Royal Shocking Comments About Her Son Check Details

అయితే పెళ్లి జరిగి మూడేళ్ల దగ్గరకు వస్తుండగా... ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పటి వరకు తాను తల్లి అయినట్లు చెప్పని ఆమె.. తనకు ఓ కొడుకు ఉన్నాడంటూ చెప్పి షాకిచ్చింది. ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా నిజమేనని ఆమె మాటలు వింటే తెలుస్తోంది. అయితే ఆ కొడుకు ఎవరు, ఇంత కాలం ఆమె ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ బజ్ షో గురించి మాట్లాడుతూ.. ఆ షో మొదలైనప్పటి నుంచి తన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం పాడైందని వివరించింది.

Bigg Boss Beauty Geetu Royal Shocking Comments About Her Son Check Details

ముందుగా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. దాని వల్ల ఓ రెండు మూడు వారాలు చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది గీతూ రాయల్. ఆ తర్వాత తన తండ్రి. ప్రస్తుతం కూడా ఆయన అనారోగ్యో సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రాండ్ ఫినాలే రోజు కూడా గీతూ తండ్రి ఆస్పత్రిలో ఉన్నట్లు ఇప్పటికే ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. అయితే తన తల్లి తర్వాత.. తండ్రి ఆరోగ్యం పాడవడానికి ముందు తాను ప్రాణంగా ప్రేమించే తన కొడుకు ఆరోగ్యం పూర్తిగా పాడైందని.. చనిపోతాడని వైద్యులు చెప్పడంతో చాలా నరకం చూశానని వెల్లడించింది.

Bigg Boss Beauty Geetu Royal Shocking Comments About Her Son Check Details

ఈక్రమంలోనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా ఏంటి నీకు కొడుకు ఉన్నాడా అని అడిగాడు. దానికి గీతూ కొడుకు అంటే నా ఓరియో.. పిల్లి అని చెప్పింది. అది పిల్లే అయినా తనకు మాత్రం కొడుకేనని వివరించింది. ఇందుకు ఇంటర్వ్యూయర్ నువ్వేమైనా కన్నావా అనగా... కనకపోయినా నా చేతులతో నేను పెంచాను వాడిని అంటూ గీతా గట్టిగా సమాధానం చెప్పింది. పార్వతీ దేవికి వినాకుడు ఏమైనా పుట్టాడా కానీ మనం ఆమె కొడుకు అనట్లేదా అని గీతూ ప్రశ్నించగా.. పిల్లిని నువ్వేమైనా తయారు చేశావా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు యాంకర్. అలా చేయకపోయినా వాడే నా కొడుకు.. వాడికి ఆరోగ్యం బాలేదు, చనిపోతాడని వైద్యులు చెప్తే తన ప్రాణం పోయినట్లు అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఓరియో పరిస్థితి బాగానే ఉందని క్లారిటీ కూడా ఇచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X