యువ హీరోయిన్ రెండో పెళ్లి.. వరుడి ఫోటోలు దాచి.. క్షమించాలంటూ పోస్ట్!

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి కాజల్ పశుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయనానికి అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ 2011లో ఆమె కో, మౌన గురు, కథమ్ కథం వంటి చిత్రాల్లో నటించి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. 2004లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ నటిగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పాతికకు పైగా చిత్రాల్లో కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ టీవీ షోలలో కూడా కనిపించింది. సీరియల్స్ తో పాటు అనేక షోలలోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ.

అలాగే తమిళ బిగ్ బాస్ సీజన్ 1 కు కంటెస్టెంట్ గా వెళ్లిన కాజల్ అద్భుతమైన ఆట తీరుతో అనేక మంది అభిమానులను సంపాధించుకుంది. సినిమాల్లో వచ్చిన క్రేజ్ కంటే కూడా బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ ను సంపాధించుకుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను చెబుతుంటుది. అయితే తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ పోస్ట్ చేసింది. అందులో ఓ షాకింగ్ న్యూస్ చెప్పి అందరికీ గట్టి షాకిచ్చింది.

Bigg Boss Beauty Kaajal Pasupathi Second Marraige Post Goes Viral

ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే తన పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ... ఫైనల్లీ రెండో పెళ్లి చేసుకున్నాను అంటూ రాసుకొచ్చింది. అలాగే అభిమానులకు క్షమాపణలు చెప్పింది. అందరూ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నానంటూ కూడా ఇన్ స్టా పోస్టులో వివరించింది. అయితే 2008లో ఫేమస్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ ను పెళ్లి చేసుకున్న ఈమె కొంత కాలం పాటు ఆయనతో చాలా హ్యాపీగా గడిపింది. కానీ నాలుగేళ్లు కాగానే వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

Bigg Boss Beauty Kaajal Pasupathi Second Marraige Post Goes Viral

ఇలా పరస్పర అంఘీకారంతో ఇద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని వారు హాయిగా జీవిస్తున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. అయితే ఇప్పటికి భర్తతో విడాకులు తీసుకుని 11 ఏళ్లు కావస్తుండగా.. రెండోసారి పెళ్లి చేసుకున్నానంటూ చెప్పి షాకిచ్చింది కాజల్. అయితే ఆమె తాజాగా చేసుకున్న పెళ్లి ఫొట కాకుండా మొదటి పెళ్లికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. నిజంగానే కాజల్ రెండో పెళ్లి చేసుకుందా అంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె ఇప్పటి ఫొటో కాకుండా పాతది పెట్టడం అందులోనూ వరుడు ఎవరో చెప్పకపోవడం, అతడి ఫొటోను కూడా బయట పెట్టకపోవడంతో ఇదంతా ఫేక్ అని అనుకుంటున్నారు. కావాలనే కాజల్ అందరిపై ప్రాంక్ చేస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో, నిజంగానే ఆమె రెండో పెళ్లి చేసుకుందా లేదా తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X