సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్.. ఓ లుక్కేయండి!
బిగ్ బాస్ షో గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోకి వచ్చే కంటెస్టెంట్లకు వచ్చే ఫేమ్ అంతా ఇంతా కాదు. ఎన్ని సినిమాలు చేసినా ఎవరికీ తెలియని వాళ్లు కూడా... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూర్తిగా తెలిసిపోయారు. ముఖ్యంగా ఇలా ఫేమ్ సంపాధించుకుని టీవీల్లో, పలు యూట్యూబ్ ఛానెళ్లలో సందడి చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్ని హాట్ బ్యూటీ వాసంతి కృష్ణన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.
బిగ్ బాస్ షోకు ముందు పలు సీరియళ్ల నటించి ఈ క్యూట్ బ్యూటీ డిసెంబర్ 7వ తేదీన తిరుపతిలోని ఓ హోటల్ లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకకు చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు వెళ్లారు. ముఖ్యంగా ఆరో సీజన్ కంటెస్టెంట్లు అయిన శ్రీసత్య, అర్జున్, ఆర్జే సూర్య, గీతూ రాయల్, ఇనయా సుల్తానాలు అక్కడకు వెళ్లి మరీ చాలా హడావుడి చేశారు. ఎంగేజ్ మెంట్ కార్యక్రమంలో ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. ఇదంతా ఇలా ఉండగా... వాసంతి ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వాసంతి కృష్ణన్... పవన్ కల్యాణ్ అనే ఓ నటుడిని పెళ్లి చేసుకోబోతుంది. తమకు దగ్గరి బంధువు అయిన ఈయనను వాసంతి ఈ ఏడాదే కలిసింది. వారిద్దరి మధ్య చిగురించిన స్నేహ బంధం ప్రేమగా మారడం... ఇరు కుటుంబ సభ్యులకు వీళ్లు ఈ విషయం చెప్పడం... వీరి పెళ్లికి వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలా సింపుల్ గా వీళ్ల లవ్ స్టోరీ సక్సెస్ అయిపోయింది. గతంలో వాసంతి గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి సీరియల్స్ లో కనిపించి మెప్పించింది. అంతేకాకుండా కన్నడలో కూడా పలు సీరియల్స్ చేసిందీ క్యూట్ బ్యూటీ.

ఇక ఆమెకు కాబోయే భర్త పవన్ కల్యాణ్ కూడా సినీ నటుడు. ఇప్పటికే ఆయన రెండు చిత్రాలు చేశాడు. అయితే అవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. నిన్న ఎంగేజ్ మెంట్ జరగ్గా.. ఈరోజు ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. కానీ పెళ్లి కూడా త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి వీరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగనుందో.



Click it and Unblock the Notifications











