మా ఆయన పేకాట పిచ్చోడు.. బాత్రూమ్‌లోకి వెళితే బయటకు రాడు: బిగ్ బాస్ బ్యూటీ అర్చన

టాలీవుడ్ యాక్టర్ అర్చన శెట్టి గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మొదటి సీజన్ లో తళుక్కున మెరిసిన ఈ తెలుగమ్మాయి పెళ్లి తరువాత చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. లాక్ డౌన్ లో భర్తతో కలిసి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ సీనియర్ నటి ఇటీవల తన భర్తపై ఎవరు ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేసింది.

తెలుగు నటిగా..

తెలుగు నటిగా..

ప్రభుదేవా తపన సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అర్చన అప్పట్లో తన అందంతో ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక అల్లరి నరేష్ నేను సినిమాలో అర్చన చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆమె నటనకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ తరువాత హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని కేవలం తనకు నచ్చిన పాత్రలని ఎంచుకుంది.

జాగ్రత్తగా ఉన్నప్పటికీ..

జాగ్రత్తగా ఉన్నప్పటికీ..

నటిగా బిజీ అవ్వాలని అర్చన అవసరం లేని కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేయడానికి ఒప్పుకుంది. కానీ అవేమి అమ్మడికి పెద్దగా లాభాన్ని చేకూర్చలేదు. చాలా వరకు బిగ్ బాస్ షోలో కనిపించేంత వరకు సపోర్టింగ్ రోల్స్ తోనే మెప్పించింది. అవకాశాలు తగ్గుతున్న తరుణంలోనే ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

 లవ్ మ్యారేజ్..

లవ్ మ్యారేజ్..

మొత్తానికి గత ఏడాది అర్చన తను ఇష్టపడిన వాడినే పెళ్లి చేసుకుంది. ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ అధ్యక్షుడిగా ఉన్న జగదీష్ భక్తవచ్చలమ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన తన భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది. నిజంగా పెళ్లి తరువత అతని అలవాట్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది.

Recommended Video

Sri Reddy vs Nandini Rai
పేకాట ఆడతాడు..

పేకాట ఆడతాడు..

అర్చన మాట్లాడుతూ.. ఎప్పుడు చూసిన నా భర్త మొబైల్ లో పేకాట ఆడుతూ ఉంటాడు. ఆ విషయంలో నాకు కొన్ని సార్లు చిరాకు వేస్తుంది. ఇక బాత్రూమ్ లోకి వెళ్ళాడు అంటే అసలు బయటకు రానే రాడు. నిజంగా పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని నాకు అస్సలు తెలియదు. కొన్నిసార్లు చాలా కోపం వస్తుందని సరదాగా నవ్వుతూ వివరణ ఇచ్చింది అర్చన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X