ఒక్క వీడియోలో ఇన్ని డ్రెస్‌లా .. ఈ బిగ్‌బాస్ బ్యూటీ ముందు హీరోయిన్లూ బలాదూర్ !
నలుగురితో తమ అభిప్రాయాలు పంచుకునేందుకు , కొత్త స్నేహితులను వెతుక్కొనేందుకు అందుబాటులోకి వచ్చింది సోషల్ మీడియా. ఈ మాధ్యమం రాకతో సమాచార విప్లవం కొంత పుంతలు తొక్కింది. ఎన్నెన్నో దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలతో పాటు సామాన్యుల గొంతుకగా నిలిచింది సోషల్ మీడియా. ప్రతిభ ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులకు బాసటగా నిలిచింది. ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా, యూట్యూబర్లుగా రాణిస్తూ సెలబ్రెటీలుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి వారిలో దీప్తి సునైన ఒకరు.
యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ .. షార్ట్ ఫిలింస్, ఇతర వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్‌తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు దీప్తి. ముఖ్యంగా బిగ్‌బాస్ తెలుగు 2లో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ టైంలో ఆటలు, గొడవలు, తన అందాల ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. బిగ్‌బాస్ తర్వాత ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు.

మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి ప్రేమలో పడ్డారు. సుదీర్ఘకాలం పాటు వీరిద్దరూ ప్రేమాయణం సాగించారు. ఇక నేడో, రేపో పెళ్లి చేసుకుంటారనగా అనూహ్య కారణాలతో ఈ జంట విడిపోయింది. షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పి ఇకపై కెరీర్‌పై ఫోకస్ పెడతానని దీప్తి తెలిపారు. వీరు విడిపోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. తిరిగి కలవాలని, పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు హల్‌చల్ చేయగా అవి పుకార్లుగానే మిగిలాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైన.. తన ఈవెంట్లు, షార్ట్ ఫిలింస్, షోల వివరాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తరచుగా ఇన్‌స్టా, ట్విట్టర్ లైవ్‌లు నిర్వహించి అభిమానులతో టచ్‌లో ఉంటారు. మొన్నామధ్య ఎడమ వైపు భుజంపై టాటూతో అందరి దృష్టిని ఆకర్షించింది దీప్తి. బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న ఓ అమ్మాయిలా పచ్చబొట్టును ఆమె పొడిపించుకున్నారు. కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని.. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసా అని రాసుకొచ్చి లేనిపోని డౌట్స్ పెట్టింది
ప్రస్తుతం ఆమె నటించిన ప్రైవేట్ ఆల్బమ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ మంచి వ్యూస్ రాబడుతున్నాయి. తనకు వీలు కుదిరినప్పుడల్లా ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసే దీప్తి సునైన తాజాగా దుబాయ్‌లో చక్కర్లు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. తాజాగా దీప్తి పంచుకున్న ఓ వీడియో ఆకట్టుకుంది. ఆ ఒక్క వీడియోలో ఆమె ఎన్నో డ్రెస్‌లలో , మరెన్నో టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో కనిపించారు. బహుశా ఆమె తన దుబాయ్ టూర్ మొత్తాన్ని క్లుప్తంగా ఓ వీడియోలో చూపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











