Deepthi Sunaina : గ్లామర్ గేట్లు ఎత్తేసిన దీప్తి సునైనా .. క్లోజప్‌ షాట్స్‌తో కాక రేపేలా!

ప్రతిభ ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులకు బాసటగా నిలిచి వారికి కొత్త జీవితాన్నిచ్చింది సోషల్ మీడియా. ఎంతో మంది ప్రస్తుతం ఇన్‌ఫ్లూయెన్సర్లుగా, యూట్యూబర్లుగా రాణిస్తూ సెలబ్రెటీలుగా వెలుగొందుతున్నారంటే ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే. నేమ్, ఫేమ్‌తో పాటు నాలుగు రాళ్లు కూడా వెనకేస్తూ సినీ తారలతో సమానంగా సంపాదిస్తున్నారు. ఇలాంటి వారిలో దీప్తి సునైన ఒకరు.

యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ .. షార్ట్ ఫిలింస్, ఇతర వీడియోలతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 2లో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ టైంలో ఆటలు, గొడవలతో పాటు తన అందాలతో బిగ్‌బాస్ హౌస్‌కి గ్లామర్ అద్దారు. అలాగే, యంగ్ హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉంటూ రెచ్చిపోయింది. బిగ్‌బాస్ తర్వాత ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు దీప్తి సునైనా. మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ .. చాలా కాలం రిలేషన్‌లో ఉన్నారు.

Bigg Boss contestant Deepthi Sunaina latest Photo shoot in tamilnadu beach

ఇక నేడో, రేపో పెళ్లి చేసుకుంటారనగా అనూహ్య కారణాలతో ఈ జంట విడిపోయి నెటిజన్లకు షాకిచ్చింది. వీరిద్దరి బ్రేకప్‌కు ఫలానా కారణం అంటూ ఏది ప్రత్యేకంగా తెలియరాలేదు. అయితే షణ్ముఖ్ బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చిన తర్వాత అతనికి దీప్తి గుడ్ బై చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. తర్వాత ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోన్న దీప్తి తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేశారు. రీల్స్, షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ప్రైవేట్ ఆల్బమ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ మంచి వ్యూస్ రాబడుతున్నాయి. ఇటీవల దీప్తి సునైన చేసిన విడిపోతే సాంగ్‌కి యువత ఫిదా అయ్యారు. యూట్యూట్‌లో ఈ సాంగ్ మంచి వ్యూస్ సంపాదించుకుంటోంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైన.. తన ఈవెంట్లు, షార్ట్ ఫిలింస్, షోల వివరాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తరచుగా ఇన్‌స్టా, ట్విట్టర్ లైవ్‌లు నిర్వహించి అభిమానులతో టచ్‌లో ఉంటారు. మొన్నామధ్య లెఫ్ట్ షోల్డర్‌పై టాటూతో అందరి దృష్టిని ఆకర్షించింది దీప్తి. బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న ఓ అమ్మాయిలా పచ్చబొట్టును ఆమె పొడిపించుకున్నారు. కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని.. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసా అని రాసుకొచ్చి లేనిపోని డౌట్స్ పెట్టింది.

ప్రస్తుతం సౌతిండియా టూర్‌లో ఉన్న దీప్తి.. ఇక్కడి ఫేమస్ ప్లేస్‌లను కవర్ చేస్తున్నారు. తొలి నుంచి బీచ్‌లలో గడపటాన్ని ఇష్టపడే ఆమె ఎక్కడికి వెళ్లినా ముందు సముద్ర తీరాలను వెతుకుతుంటారు. తాజాగా తమిళనాడులోని ఓ బీచ్‌లో దీప్తి విహరించారు. పింక్ కలర్ టాప్.. బ్లాక్ నిక్కర్‌తో కళ్లజోడు పెట్టి ఈ బిగ్‌బాస్ బ్యూటీ స్టైలీష్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీప్తి అందాలను పొగుడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం దీప్తి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: bigg boss deepthi sunaina
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X