కరాటే కళ్యాణి పొలిటికల్ ఎంట్రీ... విజయశాంతి సమక్షంలో బీజేపీ తీర్ధం
తెలుగు రాష్ట్రాల్లో కరాటే కళ్యాణి అంటూ తెలియనివారుండరు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రల్లో ఫేమస్ అయిన కరాటే కళ్యాణి బయట మాత్రం చాలా రెబల్ గా వ్యవహరిస్తుంటారు.. నిజానికి ఆవిడ పేరు పడాల కళ్యాణి కాగా కరాటేలో శిక్షణ తీసుకున్న కారణంగా ఆమెకు కరాటే కల్యాణి అనే పేరు ఏర్పడింది. అయితే ముందుగా ప్రకటించినట్టుగానే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న సినీనటి కరాటే కళ్యాణి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న కరాటే కళ్యాణి కొద్ది రోజుల క్రితం తాను ఆగస్టు 15వ తేదీన బిజెపిలో చేరబోతున్నాను అని ప్రకటించారు. ఆమె అన్నట్లుగానే ఈ రోజు ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కరాటే కళ్యాణి, కరాటే కళ్యాణి తో పాటు జల్పల్లి కౌన్సిలర్ యాదయ్య పలువురు సినీ నటులు ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ ఎందరో త్యాగాల తో దేశాన్ని దక్కించుకోగలిగామని అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ అని అన్నారు. అయితే ఎన్నో కొట్లాటలకు వెళ్లి కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం రాక్షసులు చేతుల్లోకి వెళ్లింది అని ఆమె విమర్శించారు. నిజంగా బీజేపీ మాత్రమే తెలంగాణలో సరైన పార్టీ అని బీజేపీ చేతుల్లోకి తెలంగాణ అధికారం వెళితే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
కరాటే కళ్యాణి మాట్లాడుతూ తాను గతంలో శ్రీరామ్ అంటేనే మీరు బీజేపీ నా అని అడిగే వారిని అంటే ఒక రకంగా హిందూ ధర్మాన్ని భారతదేశ ధర్మాన్ని కాపాడగలిగే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆమె అన్నారు.. విజయశాంతిని ఒక పెద్ద అక్కగా తమకు ఎప్పుడూ అండగా ఉంటారని అలాంటి వారి అవసరం బిజెపిలో చాలా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి ఆమె మాట్లాడుతూ బండి సరిగ్గా ఉన్నప్పుడే నడుస్తుందని అలాగే బండి సంజయ్ కూడా సరిగ్గా ఉన్నారు కాబట్టి బీజేపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటోందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక కరాటే కళ్యాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో చత్రపతి, కృష్ణ, మిరపకాయ్, బ్లేడ్ బాబ్జి, గోదావరి, శంకర్ దాదా ఎంబిబిఎస్, గుంటూరు టాకీస్, అదిరిందయ్యా చంద్రం లాంటి సినిమాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు దక్కాయి.
ఇక సినిమాల్లో కాస్త ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో ఆవిడ టీవీ సీరియల్స్ కూడా చేస్తోంది. జీ తెలుగులో ప్రసారం అయిన కొన్ని సీరియల్స్ లో ఆమె నటించింది. ఇక ఇక తెలుగు లో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. అయితే సీజన్ ఫోర్ లో కరాటే కళ్యాణి ఎంటర్ అయిన కొద్దిరోజులకే బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆమెకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించని కారణంగా హౌస్ లోకి ఎంటరయిన కొన్నాళ్ళకి బయటకి వచ్చేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











