అఖిల్, మోనాల్ జంటగా క్రేజీ ప్రాజెక్ట్.. ప్రేమికుల రోజున ఫస్ట్‌లుక్ రిలీజ్

బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షోలో తెలుగు బుల్లితెర పేక్షకులను అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగు 4 తర్వాత ఈ జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ జంట కలయికలో ఎప్పుడెప్పుడూ సినిమా వస్తుందా అనే విధంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలోనే సరస్వతీ క్రియేషన్స్ తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి" వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశారు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తుండగా ఎ భాస్కర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాలంటైన్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్ సార్థక్, హీరోయిన్ మోనాల్ గజ్జర్, దర్శకుడు భాస్కర్ బంటుపల్లి, నిర్మాత ఏ. భాస్కరరావు పాల్గొన్నారు.

బిగ్‌బాస్‌లో మాదిరిగానే మోనాల్‌తో కెమిస్ట్రీ

బిగ్‌బాస్‌లో మాదిరిగానే మోనాల్‌తో కెమిస్ట్రీ

బిగ్‌బాస్‌లో మోనాల్ నేను చాలా క్లోజ్‌గా ఫ్రెండ్లీగా, లవ్, ఎమోషనల్‌గా అందరికి తెలిసిందే. మా మధ్య ఉండే కెమిస్ట్రీని వెబ్ సిరీస్ ద్వారా క్లియర్‌గా చూపించబోతున్నారు. నగరం నుంచి వచ్చిన ఒక మధ్య తరగతి యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వేటలో హైదరాబాద్‌కు వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారో ఒక అంశంగా ఉంటుంది. ఆ యువకుడు అనుకోకుండా ఒక గుజరాతీ అమ్మాయిని కలిసి ఎలా లవ్ లో పడ్డాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ కథ మా ఇద్దరికీ బాగా సింక్ అయింది. ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్టు.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత భాస్కర్ రావుకి నా థాంక్స్ అని అఖిల్ సార్థక్ అన్నారు.

అఖిల్‌తో కలిసి చేయడం హ్యాపీగా

అఖిల్‌తో కలిసి చేయడం హ్యాపీగా

బిగ్‌బాస్ ఫేం మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ.. గుజరాత్ నుంచి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడింది. ఇక్కడి వాతావరణం, పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నదనేది నా క్యారెక్టర్. బిగ్‌బాస్‌లో మా జోడికి మంచి స్పందన లభించింది. తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి అనేది ఆడియెన్స్ నుంచి వచ్చిన టైటిల్. ఈ వెబ్ సిరీస్‌కి సూపర్‌గా సరిపోతుంది. ఈ వెబ్ సిరీస్ అఖిల్‌తో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

 అఖిల్, మోనాల్‌తో వెబ్ సిరీస్

అఖిల్, మోనాల్‌తో వెబ్ సిరీస్

దర్శకుడు భాస్కర్ బంటుపల్లి మాట్లాడుతూ.. బిగ్ బాస్-4లో అఖిల్, మోనాల్ పెయిర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. వాళ్ళిద్దరితో సీనిమా చేస్తే బాగుంటుందని నా మిత్రుడు సలహా ఇచ్చాడు. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. వెంటనే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఒక లైన్ అనుకున్నాను. అది మా ప్రొడ్యూసర్‌కి చెప్పగానే ఆయన వెంటనే ఒకే అని అన్నారు. ఇక నిర్మాత ఎ. భాస్కర్ రావు మాట్లాడుతూ.. బేసిగ్గా నేను డాక్టర్‌ని. బిగ్ బాస్-4 సీజన్ అంతా మిస్ అవకుండా చూశాం. అఖిల్, మోనాల్‌తో ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందని అనుకునే టైంలో భాస్కర్ వచ్చి మంచి కథ చెప్పడంతో నాకు నచ్చడం, వెంటనే ప్రాజెక్టు ఒకే చేయడం జరిగింది అని అన్నారు.

Recommended Video

Pooja Hegde's Reply To A Netizen Is Winning Hearts
నటీనటులు

నటీనటులు

నటీనటులు, సాంకేతిక విభాగం
నటీనటులు: అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ తదితరులు
బ్యానర్: సరస్వతీ క్రియేషన్స్
సమర్పణ: మాస్టర్ అజితేష్ వెంకట్
డివోపి: ఎడి మార్గల్
సంగీతం; సాకేత్ కోమండూరి
నిర్మాత; ఎ. భాస్కర్ రావు,
రచన-దర్శకత్వం; భాస్కర్ రావు బంటుపల్లి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X