twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేంద్ర మంత్రితో బిగ్ బాస్ కంటెస్టెంట్ భేటీ: ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం

    |

    బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ఎంతో మందిని సెలెబ్రిటీలుగా మార్చింది. అందుకే చాలా మంది ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా బిగ్ బాస్ షోలో పాల్గొని పాపులారిటీని దక్కించుకున్న వారిలో కత్తి కార్తీక ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఈమె.. ఆ తర్వాత బాగా ఫేమస్ అయింది. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను వాడుకుని రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.

    ఇటీవల తెలంగాణలోని దుబ్బాక అనే నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. పెద్ద పెద్ద పార్టీల అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అయినప్పటికీ ఈ ఉప ఎన్నికలో ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ బిగ్ బాస్ సెలెబ్రిటీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఆమె ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసింది.

    Bigg Boss Fame Kathi Karthika Will join BJP

    కొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కత్తి కార్తీక కేంద్ర మంత్రిని కలవడం హాట్ టాపిక్ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని, అందుకే కిషన్ రెడ్డిని కలిశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను రెండు రోజుల్లో వెల్లడించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కత్తి కార్తీక మరోసారి హైలైట్ అవుతున్నారు.

    బిగ్ బాస్‌లోకి రాకముందు కత్తి కార్తీక పలు న్యూస్ ఛానెళ్లలో ప్రజెంటర్‌గా పని చేశారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు యాంకరింగ్ బాధ్యతలూ నిర్వర్తించారు. బిగ్ బాస్ తర్వాత కూడా పలు ఛానెళ్లలో పని చేశారు.

    English summary
    Karthika was born and grew up in Hyderabad, India. She did her schooling at St. Ann's High School, Secunderabad. She received her Bachelor's degree in Architecture. She pursued her masters education in interior designing at University of Greenwich, London.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X