బిగ్‌బాస్ ఫేమ్ మానసత్తో దుమ్ములేపిన యాంకర్ విష్ణుప్రియ.. ట్రెండింగ్‌లో వీడియో
సూపర్ హిట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌తో పాపులర్ అయిన వారు ఒకరు. బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా గుర్తింపు పొందినవారు ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన సాంగ్ జరీ జరీ పంచె కట్టి. బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి ఒక రేంజ్లో డ్యాన్స్ చేసింది యాంకర్ విష్ణుప్రియ. జరీ జరీ పంచెకట్టి.. జారుడు గోచీ పెట్టి అంటూ సాగిన ఈ పాటలో మానస్, విష్ణుప్రియ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో..
బిగ్‌బాస్ ఫేమ్ మానస్, యాంకర్ విష్ణుప్రియ కలిసి అదరగొట్టిన తాజా సాంగ్ జరీ జరీ పంచె కట్టి. నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సాంగ్‌ను సుద్దాల అశోక్ తేజ రచిచంగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం. జ్యోతి ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సాంగ్‌ను మదిన్ కంపోజ్ చేశారు.

అతిరథుల సమక్షంలో విడుదల..
ఫోక్ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాటను సెప్టెంబర్ 1న విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి రఘు కుంచె, సుద్దాల అశోక్ తేజ, శేఖర్ మాస్టర్, సింగర్ సాకేత్, రమణా చారి, ప్రసన్న కుమార్, పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి, రామసత్య నారాయణ, బిగ్‌బాస్ ఫేమ్ కాజల్, సన్నీ తదితరులు హాజరయ్యారు. ''సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఈ పాటను నేను పాడటం అదృష్టంగా భావిస్తున్నా'' అని సింగర్ సాకేత్ తెలిపాడు.
పట్టుబట్టి మరి..
బిగ్‌బాస్ ఫేమ్ మానస్ మాట్లాడుతూ.. ''శేఖర్ మాస్టర్‌తో డేట్స్ కుదరకపోయిన ఆయన కొరియోగ్రఫీలోనే ఈ పాట చేయాలని పట్టుబట్టి చేయించిన నివ్రితి వైబ్స్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక యూట్యూబ్ సాంగ్‌కు ఎంతో ఖర్చు చేసి చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఈ పాటను చూసి మూవీ సాంగ్ అనుకునేలా నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. సుద్దాల అశోక్ తేజ గారి లిరిక్స్ హమ్ చేసేలా ఉన్నాయి.

మానస్ ఒక స్టార్..
ఈ పాటకు సింగర్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ వర్క్ చేశారు. అలాగే చాలా టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్లే ఈ సాంగ్ బాగా వచ్చింది. ఇలాంటి పాటలు మరెన్నో తీయాలని, ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా '' అని పేర్కొన్నాడు. ''మానస్‌ను అందరూ స్టార్ అవుతాడు అని అంటున్నారు. కానీ నాకు తెలిసినంతవరకు మానస్ ఇప్పటికే ఒక స్టార్. ఈ సాంగ్‌లో తను చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. మానస్, విష్ణుప్రియల స్టెప్పులు చూడముచ్చటగా ఉన్నాయి '' అని బిగ్‌బాస్ విన్నర్ సన్నీ తెలిపాడు.

ఒక్క రోజులోనే..
''మానస్, విష్ణుప్రియలు చేసిన సాంగ్ ప్రోమో చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశాను. ఇప్పుడు విడుదలైన ఈ పాట ఇంకా బిగ్ హిట్ అవ్వాలి '' అని కాజల్ పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన ఒక్క రోజులోనే సుమారు 2 మిలియన్ వీక్షణలు సాధించి ట్రెండింగ్‌లో దుమ్మురేపుతోంది. మానస్, విష్ణుప్రియల స్టెప్పులు పాటకే హైలెట్‌గా నిలిచాయని పలువురు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











