మరో బిగ్‌బాస్ బ్యూటీని పట్టిన మెహబూబ్.. నడిరోడ్డుపై ఆమెతో అలా

భారత్‌లో కోట్లాది మందికి ఫేవరెట్ షోగా మారిపోయింది బిగ్‌బాస్. హిందీలో తొలుత అడుగుపెట్టిన ఈ మెగా రియాలిటీ షో అక్కడ ఘన విజయం సాధించి దేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ రంగ ప్రవేశం చేసింది. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది తర్వాతి రోజుల్లో మంచి పాపులారిటీ సంపాదించి నటీనటులుగా స్థిరపడ్డారు. ఈ కోవలోకే వస్తారు బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే.

గుంటూరుకు చెందిన ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. కానీ కుటుంబ పరిస్ధితుల దృష్ట్యా చదువు పూర్తి చేసి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశాడు. కానీ మనసు సినిమాల వైపు లాగడంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సోషల్ మీడియా రాకతో దానిని ఆయుధంగా చేసుకున్న మెహబూబ్.. యూట్యూబ్, డబ్‌స్మాష్, టిక్ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ సాంగ్స్‌కి తనశైలిలో కవర్ సాంగ్స్ చేయడంలో మెహబూబ్ సిద్ధహస్తుడు. ఇతని సోషల్ మీడియా ఖాతాలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.

bigg boss fame mehaboob dilse dance with kirrak seetha for nuvve kavali song

బిగ్‌బాస్‌లో ఛాన్స్ దక్కడమే కష్టమైన పరిస్ధితుల్లో ఏకంగా రెండు సార్లు కంటెస్టెంట్‌గా ఛాన్స్‌ అందుకున్నాడు మెహబూబ్. కానీ దురదృష్టవశాత్తూ రెండు సార్లు టైటిల్ గెలవలేకపోయాడు. గతేడాది జరిగిన బిగ్‌బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోయాడు. ఆశ్చర్యకరంగా నాలుగో సీజన్‌లో దీపావళికి ఎలిమినేట్ అయిన మెహబూబ్.. ఎనిమిదవ సీజన్‌లోనూ దివాళీకే హౌస్‌ను వీడాడు.

కానీ తన ఆట తీరు , ప్రవర్తనతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రైవేట్ సాంగ్స్, ఇతర ఈవెంట్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు. తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీసత్యతో కలిసి చేసిన నువ్వేకావాలి అనే ప్రైవేట్ ఆల్బమ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా.. మనీష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. వైషు మాయ, మనీష్ ఆలపించారు. భారత్‌తో పాటు యూరప్, బార్సిలోనా, మెక్సికో, పారిస్‌లలోని అద్భుతమైన లొకేషన్స్‌లో అందంగా చిత్రీకరించారు. ఈ పాట ప్రమోషన్ కార్యక్రమాల్లో మెహబూబ్, శ్రీసత్యలు పాల్గొంటూ కాలేజీలను చుట్టేస్తున్నారు.

తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీతో మెహబూబ్ రొమాన్స్‌కు దిగాడు. బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్, బోల్డ్ బ్యూటీ కిర్రాక్ సీతతో కలిసి నువ్వేకావాలి సాంగ్‌కి స్టెప్పులు వేశాడు. మోడ్రన్ డ్రెస్‌లో కేక పుట్టించే అందాలతో సీత అతనితో కలిసి అద్భుతంగా స్టెప్స్ వేసింది. ఈ వీడియోను వీరిద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం మెహబూబ్ - శ్రీసత్యల రొమాంటిక్ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X