Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్‌బాస్ హౌస్‌లోని ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేసుకుంటూ.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న పునర్నవి
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం ఎంత కష్టమో.. బయటకు వచ్చిన కంటెస్టెంట్లను అడిగితే తెలుస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు చేతిలో ఫోన్ లేకపోతే ఉండలేము.. ఓ గంటపాటు ఒక్కచోటే కూర్చోలేం.. అలాంటివాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడితే ఎలా ఉంటుంది. అంతేకాకుండా అలిసిపోయామని కాసింత కునుకు తీద్దామంటే అదీ కుదరదు.. కుక్కల శబ్దాలతో బిగ్‌బాస్ బయపెట్టిస్తాడు.
ఇలా ఇన్ని రోజులు హౌస్‌లో తాను పడిన కష్టాన్ని మరిచిపోయేందుకు వీర విహారం చేస్తోంది. బయటకు వచ్చిన వెంటనే ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ పబ్‌లకు వెళ్తూ ఎంజాయ్ చేసింది. మరి ఇన్ని రోజులు ఒకే ఇంట్లో.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడంతో పునర్నవికి పిచ్చెక్కినట్లు అయిపోయిందేమో.
బయటకు వచ్చాక.. యమా జాలీగా తిరిగేస్తోంది. తాజాగా సముద్రం ఒడ్డున కూర్చున్న ఓ ఫోటోను షేర్ చేసింది. చూస్తుంటే.. తన ఫస్ట్రేషన్ ఇంకా తీరినట్టు లేదు. ఇష్టమైన ఫుడ్‌ను కూడా ఏమాత్రం ఆలోచించకుండా లాగించేస్తున్నట్లు కనిపిస్తోంది. అలా జాలీగా ఎంజాయ్ చేస్తోన్న పున్ను ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్ గురించి పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. తన ఫ్రెండ్ రాహుల్.. ఫైనల్ టికెట్ గెలవడంపైనా స్పందించడం లేదు. మరి తిరిగి వచ్చాక అయిన వరుణ్‌కు మద్దతుగా నిలుస్తుందో లేదా చూడాలి. ఈ వారంలో వరుణ్, అలీ, శివజ్యోతి, బాబా భాస్కర్, శ్రీముఖి నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.