జానీ మాస్టర్ తో శ్రేష్టీ వర్మ నిజ స్వరూపం ఇదే..
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వ్యవహారం గత రెండ్రోజులుగా మరోసారి పరిశ్రమలో డిస్కషన్‌కు దారి తీసింది. జానీపై ఆరోపణలు చేయడంతో పాటు కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు తాను ఎందుకు జానీపై కేసు పెట్టాను? ఎందుకు ఇన్నాళ్లు వెయిట్ చేశానో చెబుతూ శ్రేష్టీ వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జానీ మాస్టర్ వెనుక అతని భార్య ప్రమేయం ఉందని.. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడనని శ్రేష్టీ చెప్పింది. తనపై వేధింపులు జరిగిన సమయంలో తాను మేజర్‌నని, పైగా అతను పలుకుబడి కలిని వ్యక్తని.. ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి ఫైట్ చేయగలనో అప్పుడే బయటికి వచ్చానని తెలిపింది. అందుకే నాలుగేళ్ల సమయం పట్టిందని శ్రేష్టీ వర్మ క్లారిటీ ఇచ్చింది. అమ్మాయిలు నో చెబితే .. నో అంతే, ఆమె నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని తెలిపింది.

శ్రేష్టీ వర్మ ఇంటర్వ్యూ తర్వాత జానీ మాస్టర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం కావడంతో పాటు మళ్లీ మీడియా ఈ ఇష్యూని హైలైట్ చేస్తోంది. జానీ సతీమణి ఆయేషా కూడా మీడియా ముందుకొచ్చి శ్రేష్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ కనుక ఆరేళ్లుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడితే, ఆమె ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేయడం ఏంటీ అని ప్రశ్నించారు. ఆమె చెల్లి చదువుకు కూడా ఎంతో ఆర్ధిక సాయం చేయడంతో పాటు ఆమెకు డ్యాన్స్ అసోసియేషన్ సభ్యురాలి పదవి కూడా ఇప్పించామని ఆయేషా తెలిపారు.
అటు పోలీసులు సైతం ఈ పరిణామాలతో యాక్టీవ్ అవుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై బిగ్‌బాస్ కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ భాషా స్పందించారు. కొంపలు కూల్చి కెరీర్ నిలబెట్టుకోవడం అనేది మన తెలుగు సాంప్రదాయం కాదన్నారు. నా కెరీర్ గురించి తనకు బెంగ లేదని.. తనకు బోల్డెన్నీ ఆఫర్స్ వస్తున్నాయని శ్రేష్టీ అంటున్నారని శేఖర్ భాషా గుర్తుచేశారు. ఒకరి కొంప కూల్చి కెరీర్ నిలబెట్టుకోవాలా అని తెలుగువాళ్లు ఆలోచిస్తారని.. కానీ ఆమెకు మాత్రం అలాంటిదేం లేదన్నారు.

ఏం జరిగినా జానీ - శ్రేష్టీల మధ్య ఒక రిలేషన్ అనేది ఏర్పడిందని అంతా బాగానే ఉన్న సమయంలో జానీ తనను వేధించాడని, అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసిందని శేఖర్ భాషా తెలిపారు. ఆయనంటే చాలా ఇష్టమని ఒకానొక దశలో చెప్పిందని.. కానీ తాజా ఇంటర్వ్యూలో మాత్రం స్టేజ్ మీద కాబట్టి అలాగే మాట్లాడాలని కవర్ చేసుకుందని మండిపడ్డారు. ఇదంతా శ్రేష్టీ ఆడిన నాటకంలా అనిపిస్తోందని.. కేవలం అవకాశాల కోసం ఇలా చేసిందా అని శేఖర్ భాషా ప్రశ్నించారు.
జానీకి ఓ పథకం ప్రకారం కోపం తీసుకొచ్చి అప్పుడన్న మాటలని రికార్డ్ చేసి వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిందని ఆయన ఆరోపించారు. శ్రేష్టీకి వ్యవహారానికి సంబంధించిన పలు వీడియోలు, ఆడియో క్లిప్‌లు తన వద్ద ఉన్నాయని సమయం వచ్చినప్పుడు బయటపెడతానని శేఖర్ భాషా పేర్కొన్నారు. ఢీ షోకు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వారికి ఆడిషన్స్ నిర్వహించారని.. ఆమె వయసు విషయంలోనూ క్లారిటీ లేదన్నారు. ఏ పరిస్ధితుల్లో జానీ మాస్టర్‌కు శ్రేష్టీ వర్మ నో చెప్పిందో కూడా బయటపెట్టాలని శేఖర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











