ఏపీలోను అధికార మార్పు తప్పదు.. తెలంగాణ ఫలితాలే.. అసెంబ్లీ ఎన్నికలపై శివాజీ సంచలనం
నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ మరోసారి ఏపీ రాజకీయాలు, తెలంగాణలో పొలిటికల్ మార్పులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ ప్రముఖ ఛానెల్‌లో డిబేట్ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. తన రాజకీయ, సినీ భవిష్యత్ ప్రణాళికలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో శివాజీ చెప్పిన విషయాలు ఏమిటంటే?
Recommended Video

ఏపీ విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన వాళ్లు ఇవ్వలేదు. అన్ని ఎంపీ సీట్లు నాకిస్తే కేంద్రాన్ని కొట్టి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన వాళ్లు ఆ విషయం మరిచిపోయారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసిన వాళ్లు పట్టించుకోలేదు. అలాంటి సమయంలో నేను ఒంటరిగా ఉద్యమం చేస్తే లాభం లేదని అనుకొన్నాను. అందుకే నా ఫ్యామిలీ కోసం సినిమాలపై దృష్టిపెట్టాను. నేను నటిస్తే పిల్లలు చూడాలని అనుకొంటున్నారు. వారి కోరికను తీరుస్తాను అని శివాజీ అన్నారు.

నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన విషయం కూడా తెలియదు. ఆ విషయం గురించి మాట్లాడను. ఆయనను కలువాలని అనుకొన్నాను. కానీ చాలా బిజీగా ఉన్నారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తాను అని శివాజీ చెప్పారు.
నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి, నేను బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారనడంలో నాకు ఆశ్చర్యం కలుగులేదు. నేను కొంత మేరకు ముందే ఊహించాను. సర్వేలు చేసిన వాళ్లు నాకు కొన్ని విషయాలు చెప్పారు. దాంతో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు 50 శాతం అవకాశాలు ఉన్నాయనేది అర్ధం అయ్యింది అని శివాజీ చెప్పారు.

భారత్ జోడో యాత్ర సందర్భంగా గాంధీ భవన్‌కు వెళ్లి నేను స్పీచ్ ఇచ్చాను. రాహుల్, రేవంత్‌కు సపోర్ట్ చేయాలని కోరాను. రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. 25 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. అప్పుడు మీకు విజయవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సీట్లు సాధిస్తే కాంగ్రెస్‌దే అధికారం అని చెప్పానని శివాజీ పేర్కొన్నారు.

తెలంగాణలో మార్పు తప్పదు అని అనుకొన్నాను. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మార్పు తప్పదు. ఇంతకు ముందు ఎప్పుడో చెప్పాను. ఏదో చిన్నలోపం జరుగుతున్నది అని శివాజీ అన్నారు. నేను సోసైటి గురించి మాట్లాడితే.. కొందరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని అనుకొంటారు. ఒకరు ఓ పార్టీని లేపడం అనేది కష్టం. ప్రజల్లో మార్పు రావాలి. రాజకీయాలను వదిలేస్తాను. కానీ ప్రశ్నించాల్సి వచ్చిన రోజు ప్రజల గొంతుకగా మారుతానని శివాజీ అన్నారు.


Click it and Unblock the Notifications











