twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముందుగానే ఆ విషయం క్లారిటీ ఇచ్చేశాడుగా.. మాస్ కా దాస్‌తో సోహెల్ మీటింగ్

    |

    బిగ్ బాస్ షోలో సోహెల్ ఎంత రచ్చ చేశాడో.. బయటకు అంతకు మించి అనేలా హల్చల్ చేస్తున్నాడు. బిగ్ బాస్ విజేత కంటే సోహెల్ టాపిక్కే ఎక్కువగా వినిపిస్తోంది. అలా సోహెల్ ఇప్పుడు తనకు వచ్చిన ఈ ఇమేజ్‌ను చక్కగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కోరికలన్నీ తీర్చేసుకుంటున్నాడు.వెండితెరపై హీరోగా నటించాలనే కోరికను తీర్చుకునే ప్రయత్నంలో మొదటి అడుగు వేశాడు.

    మొదటి వాడు..

    మొదటి వాడు..

    బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక సోలో హీరోగా సినిమాను ప్రకటించిన మొదటి కంటెస్టెంట్‌గా సోహెల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతవరకు నాలుగు సీజన్‌ల కంటెస్టెంట్లందరిలోనూ ఏ ఒక్కరూ కూడా ఇంత త్వరగా సినిమాను అనౌన్స్ చేయలేదు. మొత్తానికి జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ నిర్మాతలతో సోహెల్ సినిమాను ప్రారంభించేశాడు.

    క్యాస్టింగ్ కాల్..

    క్యాస్టింగ్ కాల్..

    సోహెల్ సినిమాకు సంబంధించి నటీనటులు కావాలంటూ క్యాస్టింగ్ కాల్‌ ప్రకటనను ఇచ్చిన సంగతి తెలిసిందే. స్క్రిప్ట్‌కు సంబంధించిన కొత్త నటీనటులను తీసుకునే క్రమంలో ఓ ప్రకటనను విడుదల చేశారు. ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలిపారు.

     బుల్లితెర, సోషల్ మీడియాలో..

    బుల్లితెర, సోషల్ మీడియాలో..

    బిగ్ బాస్ షో ముగిసినా కూడా సోహెల్ రచ్చ మాత్రం ఆగడం లేదు. రోజూ సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉన్నాడు. అఖిల్, మోనాల్, మెహబూబ్ ఇలా ఏదో టాపిక్‌తో సోహెల్ సందడి చేస్తూనే ఉన్నాడు. పైగా బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉంటున్నాడు.

    పండుగ సందడి..

    పండుగ సందడి..

    ఇక సంక్రాంతి పండుగను బిగ్ బాస్ కంటెస్టెంట్లను బాగానే సెలెబ్రేట్ చేసుకున్నాడు. యాంకర్ రవి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, మెహబూబ్, సోహెల్ ఇలా అందరూ కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇలా మొత్తానికి స్నేహితులందరూ కలిసి పండుగను గ్రాండ్‌గా జరుపుకున్నారు.

     తాజాగా ఇలా..

    తాజాగా ఇలా..

    తాజాగా సోహెల్ ఓఫోటోను షేర్ చేశాడు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ నిన్ను కలిసినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటుందన్నా అని చెప్పుకొచ్చాడు. నోట్ అని చెబుతూ.. ఇది క్యాజువల్ మీట్.. అని మరీ నొక్కి చెప్పాడు. కథ వేరే ఉంటది అంటూ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించాడు.

    English summary
    Bigg Boss Fame Sohel Meet Vishwak Sen,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X