డేటింగ్ కి రెడీ..అందరికీ ఆహ్వానం..కానీ ఆ టైప్ వాళ్ళకే .. బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రకటన !

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ అనేక సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలలోనే ఎక్కువగా కనిపించిన జ్యోతి తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా పాల్గొని మంచి మార్కులు సంపాదించింది. అయినా ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగలేక పోయింది. ప్రస్తుతానికి ఈమె అటు సినిమాలు ఇటు బుల్లి తెరకు దూరంగా ఉంటోంది. అయితే ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ ఇంటర్వ్యూలో ఆమె తాను డేటింగ్ కి రెడీ అని తన కోసం ఎవరైనా మంచి కుర్రవాడు ఉంటే చెప్పాలని, లేదా ఎవరైనా డేటింగ్ కి వస్తే రెడీ అని చెప్పుకొచ్చింది. సంచలనం రేపుతున్న ఈ ప్రకటన గురించి మరిన్ని వివరాలలోకి వెళితే

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

బిగ్ బాస్ తో మళ్ళీ ఫాంలోకి

బిగ్ బాస్ తో మళ్ళీ ఫాంలోకి

హంగామా, పెళ్ళాం ఊరెళితే, ఎవడి గోల వాడిది, గుడుంబా శంకర్, మహాత్మ లాంటి అనేక సినిమాల్లో నటించిన ఈ భామ సినిమాలకు దూరమై చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ వన్ ద్వారా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి హౌస్ లో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 1కి వెళ్లడం చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పిన అలాగే వారంలోనే తిరిగి వచ్చేయడం బాధగా అనిపించింది అని అప్పట్లో చెప్పుకొచ్చింది. బోలెడు రోజులు ఉంటాననే నమ్మకంతో చాలా డ్రస్సులు లోపలికి తీసుకువెళ్లానని కానీ ఒక్క వారంలోనే బయటకు వచ్చేసాను అని బాధపడింది.

ఎవరితో చేశానో కూడా మీరే చెప్పండి

ఎవరితో చేశానో కూడా మీరే చెప్పండి

తాజాగా ఈ భామ ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఆమె ప్రేక్షకులతో పంచుకుంది. తాను చేసిన సినిమాలు, ఆ సినిమాలు చేసినప్పుడు అనుభవాలు గురించి కూడా ఆమె ప్రేక్షకులతో పంచుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూ లోనే ఆమె డేటింగ్ కి సంబంధించిన పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూయర్ మీరు గతంలో ఎవరితోనో డేటింగ్ చేశారంట కదా అని ప్రశ్నించగా ఎవరితో చేశానో కూడా మీరే చెప్పండి అంటూ ఆమె సరదాగా కౌంటర్ వేసింది. తాను ఇప్పటిదాకా డేటింగ్ కి వెళ్ళ లేదని ఆమె చెప్పుకొచ్చింది.

బాయ్ ఫ్రెండ్ కావలెను

బాయ్ ఫ్రెండ్ కావలెను

అయితే ఇప్పటిదాకా వెళ్లలేదు కానీ ఇప్పుడు వెళ్లాలని అనిపిస్తోందని ఆమె పేర్కొంది. సరదాగా చెప్పిందో లేక సీరియస్ గా చెప్పిందో తెలియదుగానీ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని, అలా అని ఎవరు పడితే వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయను అని చెప్పుకొచ్చింది. తాను ఒక సాపియోసెక్స్యుయల్ అని పేర్కొన్న ఆమె తెలివైన వాళ్ళు, జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్లు మాత్రమే తనతో డేటింగ్ కి రావాలని కోరింది. అంతేకాక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి అంటూ ఇంటర్వ్యూయర్ ని ఆమె కోరింది. మొత్తం మీద ఆమె కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

దేవరకొండతో అలా

దేవరకొండతో అలా

ఇక గతంలో కూడా ఈ నటి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండను పైన షర్టు లేకుండా నగ్నదేహంతో చూడాలని ఉందని అలాగే అతనితో కలిసి రొమాంటిక్ సీన్స్ లో నటించాలని ఉందని ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడు కూడా ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ భామ భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అందుకే పెళ్ళిళ్ళతో ఇబ్బంది అని జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెబుతోంది. కానీ డేటింగ్ కి మాత్రం వెళ్ళాలని ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X