Game Changer: గేమ్ ఛేంజర్ రీల్ చేస్తే 80 వేలా? చీటింగ్ ను బయట పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎలాంటి సినిమా సినిమా అయినా కూడా ప్రమోషన్స్ లేకుండా జనం అటెన్షన్ ఆకట్టుకోవడం అనేది సాధ్యపడదు. ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ మినిమమ్ ఇంటర్వ్యూలు కూడా లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చింది లేదు. ఇలా ఎన్నో కోట్లు పెట్టి తీసే సినిమాలు మళ్ళీ ఆ రేంజ్ లో జనాన్ని థియేటర్స్ లోకి రాబట్టాలంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో చేయాల్సింది గట్టి ప్రమోషన్స్ మాత్రమే చెప్పాలి.
కాగా ఇప్ప్పుడు ఈ ప్రమోషన్స్ కూడా కొంచెం కమర్షియల్ గా మారాయి. సపోజ్ ఓ భారీ సినిమానో లేక చిన్న సినిమాలో అందులో ఓ హిట్ సాంగ్ కి సోషల్ మీడియాలో రీల్స్ లేదా షార్ట్స్ చేస్తే అది సినిమాకి ప్లస్ అవుతుంది అలాగే రీచ్ వస్తుంది. కానీ కొన్ని కొన్ని సినిమాలకి మాత్రం డబ్బులిచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో డబ్బులిచ్చి చేయించుకుంటారు.

ఇలాంటివి దాదాపు భారీ పాన్ ఇండియా సినిమాలు హీరోలకి అవసరమే లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న ఓ అవైటెడ్ భారీ సినిమా "గేమ్ ఛేంజర్" చిత్రయూనిట్ సినిమాకి హైప్ లేనందున సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లతో మొన్న వచ్చిన మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా కి డబ్బులు ఇచ్చి మరీ అది కూడా వేలల్లో లక్షల్లో ఇచ్చి చేయించుకుంటున్నారు అంటూ ఓ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
అది కూడా ఒక రీల్ కి ఏకంగా 80 వేలు నుంచి 2 ఇస్తున్నారని.. పైగా ఓ స్క్రీన్ షాట్ కూడా బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ తో చాట్ వైరల్ గా మారింది. ఇందులో మెహబూబ్ సినిమాకి ఇలా ప్రమోట్ చేయడంలో తప్పేం ఉంది? సినిమాకి హైప్ లేనప్పుడు ఇలా చేయించుకుంటారు. నాకు ఇంత ఇచ్చారు రీల్ అన్నట్టు తెలిపాడు.

దీనితో గేమ్ ఛేంజర్ హైప్ లేదంటూ డబ్బులిచ్చి ఫేక్ హైప్ తెచ్చుకుంటున్నారు పలు ట్రోల్స్ గేమ్ ఛేంజర్ పై మొదలయ్యాయి. కాగా దీనిపై అసలు నిజాన్ని మెహబూబ్ బ్రేక్ చేసాడు. కాగా దీనిపై తాను స్పందిస్తూ నేనే చాట్ చేసినట్టు ఎవరో బాగా ఎడిట్ చేసే ప్రయత్నం చేసారు కానీ అది ఎడిట్ అని క్లియర్ గా తెలిసిపోతుంది కానీ ఆ చాట్ నాది కాదు ఇది నేనే అయితే ఇలా స్క్రీన్ షాట్స్ కాదు డైరెక్ట్ స్క్రీన్ రికార్డు వీడియో తీసి పెట్టాలి అని వారించాడు.
సో గేమ్ ఛేంజర్ పై హైప్ లేదు అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు. అయినా మెహబూబ్ కి ఇది వరకే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో బిగ్ బాస్ ఫైనల్ టైం కి చాలా సాయం చేశారు. అలాంటిది తన వారసుడి సినిమా విషయంలో మెహబూబ్ డబ్బులు తీసుకొని ఇలా చేస్తాడు అనేది కూడా ఒకింత నమ్మశక్యంగా అనిపించక మానదు. ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని మాసివ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా ఇద్దరు బ్యూటీస్ కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా నటించారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏస్ ప్రొడ్యూసర్ తమ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











