యువ హీరోపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ కేసు.. పెళ్లి చేసుకొంటానని 2 కోట్ల కుచ్చుటోపి.. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి వేధింపుల కేసు ఇంకా మరిచిపోకముందే.. సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన మరో నటి మరో కేసు నమోదు చేసింది. అయితే తనను పెళ్లి చేసుకొంటానని నమ్మించి 2 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు అని సదరు బాధితురాలు తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. ఎవరా సినీ సెలబ్రిటీ.. మోసం చేసిన యూట్యూబర్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు వినోద రంగంలో యూట్యూబర్‌గా రాణిస్తున్న హర్షసాయితో యువ నటి, నిర్మాత, బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌తో ఏర్పడిన పరిచయం స్నేహపూరిత సంబంధం ఏర్పడింది. అయితే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడ్డాయి. దాంతో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకొన్నారు.

Mitraaw Sharma filed Cheating case on Youtuber Harsha Sai

అయితే హర్షసాయితో ఏర్పడిన బంధంతో ప్రొఫెషనల్‌గా ఓ ముందుడుగు వేసింది. తన కాబోయే భర్తతో మెగా అనే సినిమాకు నిర్మాతగా మారింది. అలా వారిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో వారి బంధం వివాదంగా మారడంతో ఆమెకు వాస్తవ పరిస్థితి అర్ధమైంది అని సన్నిహితులు వెల్లడించారు.

అయితే తాజాగా హర్షసాయితో విభేదాల పరిష్కరించుకోలేక పోవడంతో తనకు రావాల్సిన డబ్బు విషయంపై కఠినంగా వ్యవహరించింది. తన వద్ద నుంచి తీసుకొన్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే హర్ష సాయి చేతులు ఎత్తివేయడంతో తప్పని పరిస్థితుల్లో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.

నార్సింగి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేస్తూ.. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడు. తనను నమ్మించి 2 కోట్ల రూపాయలు తీసుకొన్నాడు. హర్షసాయి కూడా తనను చీట్ చేశాడు అని ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు హర్ష, ఆయన తండ్రిపై ఫిర్యాదు చేసింది. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాధితురాలి విషయానికి వస్తే.. హిందీ సినిమా రంగానికి చెందిన ఈ యువ నటి.. టెలివిజన్ సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం హైదరాబాద్‌లో స్థిరపడింది. హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను ప్రారంభించింది. సొంత బ్యానర్‌పై హర్షసాయితో సినిమాను నిర్మించింది. ఆమె నిర్మించిన బాయ్స్, శ్రీలక్ష్మీ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X