సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ 14 ప్రారంభం.. సెలబ్రిటీల పూర్తి జాబితా ఇదే..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా హిందీలో కూడా బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమైంది. అక్టోబర్ 3 వ తేదీన ప్రారంభమైన షోకు సంబంధించిన కంటెస్టెంట్లు తొలి రోజే ఆకట్టుకొన్నారు. ఈ షోలో పాల్గోనే 14 మంది కంటెస్టెంట్లను వేదికపై సల్మాన్ ఖాన్ పరిచయం చేశారు. 14 కంటెస్టెంట్లు వీరే..

1. రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా: హిందీ టెలివిజన్ రంగంలో ఇంటింటికి సుపరిచితమైన యాక్టర్. చోటి బహు సీరియల్‌తో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. శక్తి: అస్థిత్వ కే ఎహాస్ కీ సీరియల్‌తో మరింత ప్రజాదరణను మూటగట్టుకొన్నారు. ఈ సీజన్‌లో తన భర్త అభినవ్ శుక్లాతో కలిసి జంటగా ఎంట్రీ ఇచ్చారు. అభివన్ శుక్లా విషయానికి వస్తే.. పలు టీవీ సీరియల్స్‌‌లో నటించారు.

2. ఎజాజ్ ఖాన్: హిందీ టీవీ రంగంలో యువతను విశేషంగా ఆకట్టుకొంటున్న యువ నటుడు. రెండు దశాబ్దాల కాలంగా బాలీవుడ్, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. టెలివిజన్ రంగంలో కావ్యాంజలీలో నటించారు. అలాగే తను వెడ్స్ మను లాంటి చిత్రాల్లో నటించారు.

3. జాస్మిన్ బాసిన్: హిందీ రియాలిటీ షో ఖత్రోంకి కిలాడి సీజన్ 9లో కనిపించారు. తాష్నే ఏ ఇష్క్, దిల్ సే దిల్ తక్, దిల్ తో హ్యాపీ హై జీ, నాగిన్ 4 సీరియల్స్ నటించి మెప్పించారు.

Bigg Boss season 14 contestants full list: Salman Khans Show geared up

4. నిశాంత్ సింగ్ మల్కానీ: హిందీ టెలివిజన్ రంగంలో మంచి ప్రేక్షకాదరణ ఉన్న నటుడు. రామ్ మిలాయి జోడి, తుమ్సే నా హో పాయేగా సీరియల్స్ నటించారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి ప్రవేశించారు.

5. పవిత్ర పూనియా: ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న అత్యంత శృంగార తారల్లో పవిత్ర పునియా ఒకరు. మెహ్రా చిత్రంలోని టిప్ టిప్ బర్సా పానీ పాటతో ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో బాగా తలబిరుసు, ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న కంటెస్టెంట్. బిగ్‌బాస్ 13 కంటెస్టెంటన్ పరాస్ చాబ్రాతో డేటింగ్ చేయడం ద్వారా మీడియాలో ఎక్కువగా కనిపించారు.

Bigg Boss season 14 contestants full list: Salman Khans Show geared up

6. నిక్కి తంబోలి: తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ప్రవేశిస్తూనే అందర్నీ ఆకట్టుకొన్నది. శృంగార తారగా నిక్కి హాట్ హాట్‌గా కనిపించే అవకాశం ఉందనే విషయం ఆమె స్టేజ్‌పైన చెప్పిన మాటలే స్పష్టం చేశాయి.

Bigg Boss season 14 contestants full list: Salman Khans Show geared up

7. సారా గుర్పాల్: పంజాబి సింగర్, యాక్టర్‌గా సారా గుర్పాల్ గుర్తింపు పొందారు. గత సీజన్‌లో షెహనాజ్ గిల్ మాదిరిగానే బిగ్‌బాస్ హౌస్‌లో ఆకట్టుకొంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నద.ి

8. రాహుల్ వైద్య: టెలివిజన్‌ రంగంలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న షో ఇండియన్ ఐడల్ ద్వారా గుర్తింపు పొందారు. గతేడాది బిగ్‌బాస్‌లోకి రావాల్సింది. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మ్యూజిక్ కా మహా ముఖాబ్లా, జో జీతా వోహి సూపర్‌స్టార్ షోలో పాల్గొన్నారు.

9. హెహజాద్ డియోల్: రియాలిటీ షోల ద్వారా సెలబ్రిటీగా మారారు. ఇంటిలో ఉండే అందగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

10. జాన్ కుమార్ సాను: ప్రముఖ గాయకుడు కుమార్ సాను కొడుకు. గాయకుడిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నారు. బాల్యంలోనే గాయకుడిగా పరిచయం అయ్యారు. 8 ఏళ్ల వయసులోనే తుమ్హారా షంబే తో అఅనే మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

11. రాధే మా: స్వయం ప్రకటిత దేవత రాధే మా కూడా అందరూ ఊహించనట్టుగానే ఇంటిలోకి ప్రవేశించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X