బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలె: అంతా ఊహించినట్లే రన్నరప్‌గా గీతా మాధురి!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలె అట్టహాసంగా ముగిసింది. 113 రోజులు పాటు సాగిన ఈ షోకు ఈ ఆఖరి ఆదివారం ఎంతో కీలకంగా మారింది. ఐదుగురు కంటెస్టెంట్లలో ముందు సామ్రాట్, దీప్తి నల్లమోతు, తనీష్ ఔట్ అవ్వగా..... కౌశల్, గీతా మాధురి టైటిల్ పోరులో నిలిచారు.
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్.... కౌశల్ అని, గీతా మాధురి రన్నరప్ అని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతా ఊహించినట్లే బిగ్ బాస్ షో సాగడం గమనార్హం. అయితే టైటిల్ మిస్ అవ్వడంతో గీతా మాధురి కాస్త అసంతృప్తిగా కనిపించారు.

బిగ్ బాస్ విన్నర్ ఎవరో ప్రకటించడానికి విక్టరీ వెంకటేష్ ఈ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాసేపు ఉత్కంఠ కొనసాగిన అనంతరం గీతా మాధురిని బిగ్ బాస్ సీజన్ 2 రన్నరప్‌గా ప్రకటించారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ షో గురించి ఓ ప్రత్యేకమైన ప్రోమో ప్రదర్శించారు.
బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన 16 మంది సభ్యులు.... విన్నర్ అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతలా కష్టపడ్డారు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు అనేది వెల్లడిస్తూ ప్రదర్శించిన ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











