బిగ్‌బాస్ తెలుగు 2 ఫైనల్ అప్‌డేట్: మళ్లీ ఇంట్లోకి వెళ్తా.. సునైన.. తనీష్ ఉండడుగా.. నాని!
బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. నాని హోస్ట్‌గా డిఫరెంట్ మార్కులో స్టేజి పైకి వచ్చారు. వేదికపై పాటలకు డ్యాన్సులు చేస్తూ నాని ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత ఫైనల్‌కు చేరిన ఐదుగురు హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్‌తో నాని మాట్లాడారు. దీప్తి సునైనాతో మాట్లాడుతూ నాని చురకలు అంటించారు.
బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత లైఫ్ ఎలా ఉంది అని నాని అడుగగా.. దీప్తి సునైనా జవాబిస్తూ.. చాలా బావుంది. మళ్లీ ఇంట్లోకి వెళ్లాలని ఉంది అని దీప్తి అన్నారు.

అయితే నిన్ను లోనికి పంపిస్తాను. కానీ తనీష్ ఉండడు. ఎలా ఇంట్లో ఉంటావు అని దీప్తి సునైనాకు నాని షాక్ ఇచ్చారు. అయినా నేను ఒంటరిగానే ఇంట్లో ఉంటాను అని దీప్తి సునైనా చెప్పడం గమనార్హం. ఇంట్లో ఉన్నన్నీ రోజులు దీప్తి సునైనా నిద్రకే పరిమితమైన సంగతి తెలిసిందే. శనివారం ప్రసారమైన బిగ్‌బాస్ పార్టీ ఎపిసోడ్‌లో స్లీపింగ్ బ్యూటీ అవార్డు దీప్తి సునైన గెలుచుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











