బిగ్‌బాస్ తెలుగు 2 ఫైనల్ అప్‌డేట్: నేను ఇప్పుడు విలన్ కాదు.. అమిత్ భయ్యాను!
బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. నాని హోస్ట్‌గా డిఫరెంట్ మార్కులో స్టేజి పైకి వచ్చారు. వేదికపై పాటలకు డ్యాన్సులు చేస్తూ నాని ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత ఫైనల్‌కు చేరిన ఐదుగురు హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్‌తో నాని మాట్లాడారు. అమిత్ తివారీని నాని పలకరించి.. ఎలిమినేషన్ తర్వాత లైఫ్ ఎలా ఉంది అని అడిగాడు.
బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక విషయంపై నాకు నేను నిర్ణయం తీసుకొన్నాను. బయటకు వెళ్లిన తర్వాత ఫోన్‌కు దూరంగా ఉండాలని అనుకొన్నాను. అలా అనుకొన్నట్టే ఫోన్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతోనే గడిపాను. చాలా హ్యాపీగా లైఫ్ ఉంది అని అమిత్ అన్నాడు.

బిగ్‌బాస్ తర్వాత నా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్‌బాస్‌కు ముందు నాతో మాట్లాడటానికి మహిళలు, చిన్నపిల్లలు భయపడ్డేవారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళలు, పిల్లలందరూ నాతో బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనంటే వారి దృష్టిలో విలన్ కాదు. అమిత్ భయ్యగా మారిపోయాను అని అమిత్ తెలిపారు.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత నాతో వేల మంది సెల్పీలు తీసుకొంటున్నాను. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. దాంతో నేను బిగ్‌బాస్‌కు వచ్చిన పర్పస్ వర్కవుట్ అయిపొయిందని అనిపిస్తుంది అని అమిత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











