బిగ్‌బాస్ తెలుగు 2 ఫైనల్ అప్‌డేట్: బిగ్‌బాస్ నుంచి సామ్రాట్ అవుట్
బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. నాని హోస్ట్‌గా డిఫరెంట్ మార్కులో స్టేజి పైకి వచ్చారు. వేదికపై పాటలకు డ్యాన్సులు చేస్తూ నాని ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత ఫైనల్‌కు చేరిన ఐదుగురు హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్‌తో నాని మాట్లాడారు. అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. టాప్ ఐదుగురు కంటెస్టెంట్స్ నుంచి తొలుత సామ్రాట్ ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్‌బాస్ తెలుగు 2 షోలోకి వెళ్లిన సామ్రాట్ రెడ్డి టాప్ ఐదుగురిలో ఒకరిగా నిలిచారు. బిగ్‌బాస్ ఫైనల్ షో సందర్బంగా జరిగిన ఎలిమినేషన్‌లో సామ్రాట్ మొదటి వ్యక్తిగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంట్లో మిగితా నలుగురు సభ్యులతో సెల్పీ దిగిన తర్వాత సామ్రాట్‌ను నాని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం 113 రోజుల లైఫ్ జర్నీని చూపించారు. ఈ సందర్బంగా సామ్రాట్ ఉద్వేగానికి గురయ్యాడు.

బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చిన తర్వాత గత నాలుగు నెలల్లో చాలా నేర్చుకొన్నాను. రిలేషన్స్ ఎంత ముఖ్యమో తెలిసింది. రెస్పాన్స్‌బిలిటీ అంటే ఏమిటో నాకు అర్ధమైంది అని నానితో సమ్రాట్ అన్నారు.


Click it and Unblock the Notifications











