బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలె: నందును చూసి గీతా మాధురి భావోద్వేగం, మరో ఛాన్స్ ఇవ్వాలంటూ!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలె అట్టహాసంగా జరిగింది. తెలుగు సినిమా సూపర్ హిట్ సాంగులకు డాన్స్ చేస్తూ నాని ఎంట్రీ అదరగొట్టాడు. ముఖ్యంగా నాని తన మాస్ సినిమాలోని పాటలకు చేసిన డాన్స్ అదిరిపోయింది. తర్వాత ఒక్కో కంటెస్టెంటును పలకరిస్తూ వారి అభిప్రాయాలు వెల్లడించారు.
బిగ్ బాస్ ఇంట్లో స్క్రీన్ ద్వారా తమ తన భర్త నందు, తల్లిదండ్రులను చూసిన గీతా మాధురి ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో బిగ్‌బాస్ ఇంట్లో నుండి బయటకు రావాలని లేదని తన మనసులోని మాట బయట పెట్టారు.

మరోసారి బిగ్ బాస్ ఆడే ఛాన్స్ ఇవ్వాలని, మరో ఆరు నెలలు ఆగి మళ్లీ ఈ గేమ్ షో ఆడాలని ఉందన్నారు. ఇది నీకు సమ్మతమేనా? అంటూ నాని... వెంటనే గీత భర్త నందును అడగ్గా.... నన్ను కూడా బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తే ఓకే అంటూ సమాధానం ఇచ్చారు.
తనీష్‌ను చూసిన వెంటనే ఆమె తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఏడవొద్దమ్మా మరికొసేపట్లో అక్కడికి వచ్చేస్తాను అంటూ ఓదార్చాడు. ఈ సందర్భంగా తనీష్ తల్లి... నువ్వు బయటకు వచ్చిన తర్వాత సిక్స్ ప్యాక్ చేస్తానని మాటివ్వు అంటూ కోరగా... అది నా వల్ల కాదు అంటూ తేల్చి చెప్పాడు తనీష్. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత నా కొడుకు కాస్త సన్నబడినందుకు సంతోషంగా ఉందని తనీష్ తల్లి వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











