Bigg Boss Telugu 7 Winner: మనుషుల్లా ప్రవర్తిద్దాం.. ఆటను ఆటగానే తీసుకుందాం.. బిగ్‌బాస్ విన్నర్ పోస్ట్ వైరల్!

సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం అయిన డిసెంబర్ 17వ తేదీన ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన రెస్పాన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన ఈ షోలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఈ సీజన్ విన్నర్ గా నిలిచిన ఇతడికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా వీరంతా ఆయనను చూసేందుకు గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ కు వచ్చేశారు. అక్కడే పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఆయన్ను కలవాలని, మాట్లాడాలని చూశారు. కుదరకపోయేసరికి చాలా మంది రచ్చ రచ్చ చేశారు.

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కు శత్రువు అయిన అమర్ దీప్ పై మాత్రం దాడికి పాల్పడ్డారు. ఆయన కారుపైకి రాళ్లు విసిరి అద్దాలు మొత్తం పగులగొట్టారు. అలాగే ఆయన వెళ్తున్న కారుపైనే కాకుండా గీతా రాయల్, అశ్వినీ శ్రీ కార్లను కూడా పగులగొట్టేశారు. వీటితో పాటు మరో ఆరు తెలంగాణ ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన ఈ దాడిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సోషల్ మీడియా మొత్తం అభిమానులు అలా చేసి ఉండేది లేకుండే అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందించారు.

Bigg Boss Telugu 2 Season Winner Kaushal Manda Responds on Pallavi prashanth Fans Attack

ఇప్పటికే ఈ ఘటనను సుమోటాగా స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కూడా కేసు పెట్టారు. సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. రైతుబిడ్డపైనే కాకుండా పలువురు అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దాడి అమానవీయం అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా స్పందించారు. బిగ్ బాస్ షో కేవలం ఒక ఆట మాత్రమే అని.. దాన్ని ఆటగానే చూడాలంటూ తెలిపాడు.

Bigg Boss Telugu 2 Season Winner Kaushal Manda Responds on Pallavi prashanth Fans Attack

అలాగే దీన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదని అన్నారు. షోలో భాగంగా ఒకరితో ఒకరు పోటీ పడిన తర్వాత కూడా బయటకు వచ్చాకా స్నేహితుల్లా మారిపోతారని అన్నారు. గేమ్ లో గెలిచేందుకు ఎన్ని ఎత్తులు, పైఎత్తులు వేసినా... ఇది కేవలం గేమ్ మాత్రమే అని ఎవరూ దీన్ని సీరియస్ గా తీసుకోకూడదని అన్నారు. విన్నర్ అభిమానులు అంతా కలిసి మరో కంటెస్టెంట్ పై దాడి చేయడం, వాళ్ల కారుపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇది తెలిసిన తర్వాత తాను చాలా బాధపడినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ముందు ముందు గేమ్ ఆడేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపరని అన్నారు.

Bigg Boss Telugu 2 Season Winner Kaushal Manda Responds on Pallavi prashanth Fans Attack

మనం చేసే పనులే మనం మనుషులమో కాదో చెబుతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. షో అయిపోయాకా.. కంటెస్టెంట్లను వాళ్ల వాళ్ల పర్సనల్ జీవితాలను వాళ్లను బతకనివ్వాలి అంటూ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా ప్రేమ, మద్దతును చూపించడం సహజమేనని.. కానీ సరిహద్దులను ఎప్పుడూ దాటకూడదని గుర్తించుకోవడం ముఖ్యమని అన్నారు. ఇది మన ప్రేమను చూపుతున్న వ్యక్తి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. అందరితో గౌరవంగా ఉండి.. మనుషుల్లా ప్రవర్తిద్దాం అంటూ చెప్పుకొచ్చారు కౌశల్ మండ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X