Kaushal Manda హీరోగా రైట్.. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్
మహంకాళి మూవీస్ పతాకంపై కౌశల్ మండా, లీషా ఎక్లైర్స్ హీరో, హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో మహంకాళి దివాకర్, లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం రైట్. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన మెమోరీస్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా

విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ.. కౌశల్ నటించిన రైట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి జీతూ జోసఫ్ కథను అందించారు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ నటిస్తున్న రైట్ చిత్రం మంచి విజయం సాధించాలి. మోషన్ పోస్టర్ బాగుంది. కౌశల్‌కు ఈ చిత్రం సక్సెస్‌ను అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరో కౌశల్ మండా మాట్లాడుతూ.. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ఈ చిత్రం చేశాను. నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేయించాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు నా కోరిక తీరింది. వెంకటేష్ నా సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం జీతూ జోసెఫ్ గారి మెమోరీస్ చిత్రం రీమేక్ ఇది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మీరు అందరు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఉంటాను. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలో థియేటర్‌లో విడుదల అవుతుంది. నేను బిగ్‌బాస్‌లో ఉన్నపుడు తెలుగు ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేసి విన్నర్‌ని చేశారు. మీ అందరికీ గుర్తుగా నేను నా హృదయానికి దగ్గరగా టాటూ వేయించుకున్నాను. మీ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలి, అలాగే నా రైట్ చిత్రాన్ని చూసి నన్ను బ్లెస్స్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నాకు ఏ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు దివాకర్, లూకాలపు మధు గారికి ధన్యవాదాలు. 40 ఏళ్లుగా ప్రతి క్రాఫ్ట్‌లో ఎంతో అనుభవం ఉన్న శంకర్ ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు. మన నిర్మాత దివాకర్ సంజీవిని బ్లడ్ బ్యాంక్ తరపున లక్షల మందికి సహాయం చేశారు. నాకు చారిటీ అంటే ఇష్టం. దివాకర్ ప్రతి మంచి పనికి నేను తోడుగా ఉంటాను. టాప్ టెక్నిషన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు

నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ విజయం తర్వాత తొలిసారి కౌశల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి లుక్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ గారికి నా కృతజ్ఞతలు. షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు
నిర్మాత లుకలాపు మధు మాట్లాడుతూ "మా రైట్ మూవీ మొదటి పోస్టర్ ను మోషన్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు. కౌశల్ గారు బిగ్ బాస్ తర్వాత ఈ చిత్రం లో హీరో గా నటించారు. కథ చాలా బాగుంది. మంచి విజయం సాధిస్తుంది" అని కోరుకున్నారు.
నటి నటులు : కౌశల్ మండ, లీషా ఎక్లైర్స్, 30 ఇయర్స్ పృథ్వి, ఆమని, ముక్తార్ ఖాన్ , తదితరులు
డైరెక్టర్: శంకర్
నిర్మాతలు: మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు
మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ కూరాకుల
కెమెరా మాన్: ఈ వి వి ప్రసాద్
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్
ఎడిటర్: తిరుపతి రెడ్డి
పీఆర్వో: పవన్ పాల్
కో - డైరెక్టర్: రఘు వర్ధన్, భిక్షు
బ్యానర్: మహంకాళి మూవీస్


Click it and Unblock the Notifications











