For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mr Pregnant: Bigg boss 4 సోహెల్ ప్రెగ్నెంట్.. కడుపుతోనే ఫైట్ చేస్తూ.. షాకింగ్!

  |

  'బిగ్ బాస్ తెలుగు సీజన్ 4' ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సయ్యద్ సోహెల్ రియాన్ వెండితెరపై హీరోగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించిన సాహెల్ ఆ తర్వాత సీరియల్స్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అవి కూడా అతని కెరీర్ కు అంతగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇక బిగ్ బాస్ అనంతరం అతని కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తరువాత సినిమా ఆఫర్స్ రావడం తో తనకు సూటయ్యే కథలను సెలెక్ట్ చేసుకొని బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే త్వరలోనే విడుదల కాబోతున్న ఒక సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశాడు. అందులో సయ్యద్ సోహెల్ ఒక ప్రెగ్నెంట్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా ట్రై చేస్తున్న ఈ కాన్సెప్ట్ అయితే ఓ వర్గం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  ఏ మాత్రం తొందరపడకుండా

  ఏ మాత్రం తొందరపడకుండా

  నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆ సీజన్లో బిగ్ బాస్ విజేత అభిజిత్ కంటే కూడా మూడవ స్థానంలో నిలిచిన సోహెల్ కు మంచి క్రేజ్ అయితే దక్కింది. మెగాస్టార్ చిరంజీవి కూడా అతన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. 25 లక్షలు ప్రైజ్ మనీ తో బయటకు వచ్చినా సోహెల్ ఎన్నో సినిమా ఆఫర్స్ అయితే అందుకున్నాడు. అయితే ఆ విషయంలో ఏ మాత్రం తొందరపడకుండా కేవలం తనకు సూటయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక మొదటి సినిమా ఆల్ మోస్ట్ రెడీ అయ్యింది.

  జార్జిరెడ్డి మేకర్స్ తో కలిసి..

  జార్జిరెడ్డి మేకర్స్ తో కలిసి..

  సయ్యద్ సోహైల్ రియాన్ కొత్త సినిమాకు ‘మిస్టర్ ప్రెగ్నెంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆదివారం ఈ టైటిల్ ను ఒక ప్రత్యేకమైన గ్లింప్స్‌ తో చిత్ర బృందం అనౌన్స్ చేశారు. జార్జిరెడ్డి సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల ఈ ప్రయోగాత్మకమైన సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

  సరికొత్తగా మిస్టర్ ప్రెగ్నెంట్

  సరికొత్తగా మిస్టర్ ప్రెగ్నెంట్

  గత కొన్ని నెలల క్రితం సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ కూడా పెంచటానికి సిద్ధం అయ్యారు. ఇక మొదటి అడుగులోనే చిత్ర యూనిట్ అమితంగా ఆకట్టుకుంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్' టైటిల్ ఆసక్తికరంగా, కొత్తగా అనిపిస్తోంది. సినిమాల్ హీరోగా సోహైల్ సందడి చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ ను బట్టి ఈ సినిమా కథా కథనాల పరంగా టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని తెలుస్తోంది.

  కడుపుతో ఉన్నాను..

  కడుపుతో ఉన్నాను..

  ఇంతవరకు ఏ హీరో కూడా ఇలాంటి ప్రయోగం అయితే చేయలేదు. మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిల్ గ్లింప్స్‌ లో అయితే హీరో సాహెల్ ఫైట్ తోనే చాలా డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. కూల్ బ్రో.. ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా? కడుపుతో ఉన్నానని చెబుతున్నా కదా.. యస్ నేను ప్రెగ్నెంట్. వెల్కమ్ టూ ద న్యూ వరల్డ్ మై బేబి అనే.. డైలాగ్ తో సరికొత్తగా ఆకట్టుకున్నాడు. చూస్తుంటే మొదటి సినిమాతోనే సాహెల్ ఏదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్ధమవుతోంది.

  అన్ని వర్గాల వారికి నచ్చేలా

  అన్ని వర్గాల వారికి నచ్చేలా


  సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్' చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నట్లు
  గ్లింప్స్‌ తోనే క్లారిటీ ఇచ్చేశారు. అతని పాత్ర, కథాంశం కూడా చాలా విభిన్నంగా ఉంటాయట. ఇక పిల్లలకూ, పెద్దలకూ నచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సోహెల్ కు జోడిగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా తుది దశలో ఉన్నట్లు తెలిపారు. ఇక ‘మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

  మెగాస్టార్ రోల్ ఉంటుందా?

  మెగాస్టార్ రోల్ ఉంటుందా?

  సోహెల్ సయ్యద్ ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు అయితే గతంలో బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కు ప్రత్యేక అతిథిగా వచ్చిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి సాహెల్ మొదటి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. మరి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో సోహెల్ ఆ విధంగా ఏదైనా సహాయం తీసుకున్నాడో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే

  House Arrest Movie Team Funny Chit Chat With Roll Rida

  సినిమా యూనిట్..


  నటీనటులు* : సయ్యద్ సొహైల్ రియాన్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు.
  *సాంకేతిక నిపుణులు* : సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి

  English summary
  Bigg boss telugu 4 contestant syed sohel ryan mr Pregnant first glimpse
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X