బిగ్‌బాస్ ఫేం సోహైల్ హీరోగా క్రేజీ ప్రాజెక్ట్.. దేశ సినీ చరిత్రలో రాని పాయింట్ అంటూ నిర్మాత..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా ప్రేక్షకులనే కాకుండా సినీ హీరోలను ఆకట్టుకొన్న సయ్యద్ సోహైల్ ర్యాన్ తన కెరీర్ విషయంలో జోరు పెంచాడు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సయ్యద్ సోహైల్ మరో సినిమాకు కూడా ఒకే చెప్పారు.

సయ్యద్ సోహైల్ ర్యాన్ హీరోగా రూపొందే చిత్రానికి నిర్మాత అప్పిరెడ్డి. గతంలో జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ లాంటి చిత్రాలను రూపొందించారు. మూడో చిత్రానికి సోహైల్‌ను హీరోగా ఎంచుకొన్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వింజనంపాటి కొత్త దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Bigg Boss Telugu 4 fame Syed Sohel Ryan movie started

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీ బ్యానర్ నుంచి జార్జి రెడ్డి, ప్రెషర్ కుక్కర్ లాంటి మూవీస్ తీశాం. ఇప్పుడు మూడో సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటితో కలిసి తెరకెక్కిస్తున్నాం. బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు దేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం అని అన్నారు

నటీనటులు: సయ్యద్ సోహైల్ ర్యాన్ తదితరులు
మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఆర్ట్: గాంధీ నడికుడికార్
నిర్మాతలు: అప్పిరెడ్డి,సజ్జల రవిరెడ్డి,అభిషేక్ రెడ్డి
రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X